ఎయిర్ ఇండియా పైలెట్లకు 60 మందికి కరోనా..!

కరోనా కల్లోలం దేశాన్ని అతలకుతలం చేస్తోంది.సామాన్య ప్రజల నుంచి అన్ని శాఖల అధికారులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

 Corona For 60 Air India Pilots ..!, Coronavirus, Air India, Pilots, Air India Em-TeluguStop.com

దీంతో విధులు నిర్వహించాలంటే జంకుతున్నారు అధికారులు.ఇప్పటికే ఉన్నతా స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు కరోనా దాటికి గురయ్యారు.

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్నా పోలీసు, వైద్యా, ఆరోగ్య, మున్సిపల్ శాఖలలో ఈ తాకిడి ఎక్కువ ఉంది.తాజాగా ఈ జాబితాలో ఎయిర్ ఇండియా ఉద్యోగులు కూడా చేరారు.

వందేభారత్ మిషన్‌లో పాల్గొన్న ఎయిర్ ఇండియా సిబ్బందిలో 60 మంది పైలెట్లకు కరోనా సోకింది

కరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్ మిషన్’ కింద స్వదేశానికి కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానాల్లో పనిచేసే 60 మంది పైలెట్లకు కరోనా సోకిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ వెల్లడించింది.

ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి కమిటీ లేఖ రాసింది. 137 దేశాల నుంచి 5,05,990 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని, కరోనా సంక్షోభ సమయంలోనూ సేవలందిస్తున్నందున తమ సమస్యలను పరిష్కరించాలని పైలెట్ల సంఘం మంత్రిని కోరింది.

ప్రాణాలకు తెగించి కరోనా కష్ట కాలంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన పైలెట్లకు జీతాలు కోత పెట్టడం సమంజసం కాదని ఎయిర్‌‌ ఇండియా పైలెట్లు లేఖలో పేర్కోన్నారు.జీతాల్లో కోత పెట్టడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని పైలెట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube