తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న క్రమంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.అయితే బీజేపీ నాయకులు తాజాగా అమిత్ షాతో సమావేశం తర్వాత మరింతగా దూకుడు పెంచిన పరిస్థితి ఉంది.
ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా అందుకనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని అమిత్ షా సూచనల ప్రకారం క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం లేని నియోజకవర్గాలలో ఇప్పటికే దృష్టి సారించిన బీజేపీ శిక్షణా తరగతుల పేరిట సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ టార్గెట్ గా ఇటు బీజేపీ, కాంగ్రెస్ లు తమ కార్యాచరణను రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే బీజేపీ విషయానికొస్తే మిషన్-19 పేరుతో ఇప్పటికే నేతలకు ఒక ప్రాధమిక దిశా నిర్ధేశం చేసిన బండి సంజయ్ ఎస్సీ నియోజక వర్గాలే టార్గెట్ గా అక్కడ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలపడం జరిగింది.
అయితే బీజేపీ ఇంతగా దూకుడు ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ పార్టీ పై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇంకా విమర్శల దాడి పెంచుతూ ఉంటే టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరుగుతుందనే భావనలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ దూకుడు టీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.ఎందుకంటే తాజా గణాంకాలలో తెలంగాణ అగ్రస్థానాలను సాధిస్తున్న తరుణంలో ఇక ప్రజల్లోకి అంతగా విమర్శలు రానున్న రోజుల్లో వెళ్ళే అవకాశం లేనట్లు తెలుస్తోంది.అందుకే ఎక్కువగా పాలనపైనే కేసీఆర్ దృష్టి పెట్టి ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.