అమ్మో.. ఈ ఆరు సినిమాల బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం?

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే ఆ కథను బట్టి ఆ సినిమాకు బడ్జెట్ నిర్ణయిస్తారు.ఒకప్పుడు అత్యంత తక్కువ బడ్జెట్ తో సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్యలో సినిమాలను తెరకెక్కించే వారు.

 Do You Know This Tollywood Six Movies Budget Details, Tollywood, Six Movies, Rr-TeluguStop.com

అందుకే అప్పట్లో సినిమా తీయాలంటే నిర్మాతలు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు.కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకులు కూడా సినిమా నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే దర్శకులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ సినిమాలను తెరకెక్కించడం మొదలుపెట్టారు.ఇలా సాంకేతిక నైపుణ్యతతో సినిమాలు తెరకెక్కించడం వల్ల ఆ సినిమాలకు అధిక మొత్తంలో డబ్బు కేటాయించాల్సి వస్తోంది.

ఈ క్రమంలోని ఒక్కో సినిమాకి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేయడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు.ఇలా ప్రస్తుత కాలంలో తెరకెక్కిన చిత్రాలకు ఏకంగా కోట్లలో డబ్బులు కేటాయిస్తూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

అయితే ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను బాగా ఆదరిస్తున్నారని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మరి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల విషయానికి వస్తే…

Telugu Acharya, Allu Arjun, Bheemla Nayak, Chiranjeevi, Dvv Danayya, Budget, Khi

ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా కోసం ఏకంగా నిర్మాత డివివి దానయ్య నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.అలాగే బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అలాగే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు.అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకోసం మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 150 కోట్లు ఖర్చు చేశారు.

Telugu Acharya, Allu Arjun, Bheemla Nayak, Chiranjeevi, Dvv Danayya, Budget, Khi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్, రామ్ చరణ్ తేజ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు.ఈ సినిమాకోసం రామ్ చరణ్ ఈ విధంగా 120 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం 120 కోట్లను ఖర్చు చేశారు.

అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఖిలాడి ఈ సినిమా కోసం ఏకంగా నిర్మాతలు 70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇలా ఈ ఆరు సినిమాలు ఏకంగా భారీ బడ్జెట్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube