వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ నలుగురే కీలక మంటున్న సీబీఐ..!!

తెలుగు రాజకీయాలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం అని చెప్పవచ్చు.సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం ముందు జరిగిన ఈ హత్య ఏపీ రాజకీయాలను కుదిపేసింది.

 Those Four Are The Key Culprits In The Murder Case Of Ys Vivekananda Reddy Say C-TeluguStop.com

అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు వైఎస్ వివేకా హత్య వెనకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అనేక ఆరోపణలు చేశారు.ఇక ఇదే తరుణంలో టీడీపీ నాయకులు.

ఎన్నికలలో సానుభూతి ఓట్లు సంపాదించుకోవడానికి… సొంత చిన్నాన్న ను వైసిపి వాళ్లే మట్టుబెట్టారని ఆరోపణలు చేయడం జరిగింది.

ఇదంతా పక్కన పెడితే జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచే వాటం జగన్ ముఖ్యమంత్రి అవడం.

అంతా తెలిసిందే.ఈ క్రమంలో ఈ హత్య కేసులో.

అసలు నిజం బయట పడుతుంది అని అందరూ భావించారు.కానీ ఉన్న కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది.

హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దాదాపు ఏడాదికి పైగా… విచారణ చేస్తూ ఉండటం తో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా మిస్టరీగా మారింది.సి.బి.ఐ విచారణలో ఇప్పటివరకు కీలక నిందితులు ఎవరు అన్నదానిపై మొన్నటివరకూ ఏం తేలలేదు.ఈ తరుణంలో వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు సునీత.ఎప్పటికప్పుడు మీడియా సమావేశం పెట్టి జరుగుతున్న విచారణపై.

తనదైన శైలిలో కామెంట్ చేస్తూ ఉన్నారు.

Telugu Dasthagiri, Erra Gangi, Jagan, Suneetha, Sunil Yadav, Tdp, Ysvivekananda-

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సిబిఐ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులు ఈ నలుగురే అని పేర్లను బయట పెట్టింది.ఈ హత్య కేసుకు సంబంధించి తాజాగా సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో. ఎర్ర గంగిరెడ్డి, సునిల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి. నిందితులలో ప్రస్తుతం ఇద్దరూ కడప జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.మరో ఇద్దరికీ బెయిల్ మంజూరు అయినట్లు చార్జిషీట్ లో.సి.బి.ఐ స్పష్టం చేయడం జరిగింది.ఈ నలుగురు వివేక నంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులు అని ఛార్జిషీట్ లో సీబీఐ స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube