సాధారణంగా మనకు సిరి సంపదలు కలగాలంటే లక్ష్మీదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటే మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.అయితే లక్ష్మీదేవి మనకు తామర పువ్వు పై కూర్చొని దర్శనమిస్తున్నటువంటి ఫోటోలను చూసి ఉంటాము.
అదే విధంగా గుడ్లగూబను వాహనంగా కలిగి ఉన్నటువంటి ఫోటోలను కూడా చూసి ఉంటాము.అయితే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా మారడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా గుడ్లగూబను ఎంతో అపశకునంగా భావిస్తారు.
గుడ్లగూబ అరిచినా ఏదో కీడు జరగబోతుందని చాలామంది విశ్వసిస్తుంటారు.అలాంటి అపశకునం అయిన గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా ఎలా మారింది అనే విషయానికి వస్తే….
పురాణాల ప్రకారం దర్బాస ముని శాపం కారణంగా ఇంత దేవుడు నిరాశ్రయులయ్యారు.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి సముద్రంలో నివసించేవాడు.
అయితే అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి ఆదేశానుసారం లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుడుతుంది.ఈ విధంగా సముద్రం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తనకు వాహనం కావాలని కోరుతుంది.
అప్పటికే నెమలిని ఇతరులు వాహనంగా తీసుకోవడం ద్వారా అమ్మవారు గుడ్లగూబను తన వాహనంగా చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే గుడ్లగూబ అమ్మవారికి వాహనంగా కావడం వెనుక మరొక కారణం కూడా ఉంది.సహజంగా పంటలు పండించే రైతులు పంట చేతికి వచ్చే సమయానికి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆ పంట పొలంలో ఎలాంటి పురుగులు ఎలుకలు పంటను నాశనం చేయకుండా ఉండటం కోసం లక్ష్మీదేవి తన వాహనాన్ని పంపి పంటను రక్షిస్తుందని చెప్పవచ్చు.ఈ కారణంగానే లక్ష్మీదేవి తన వాహనంగా గుడ్లగూబను ఎన్నుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి.
ఇక అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే వ్రతాలు నోములు వంటివాటిని చేయకపోయినా మనసులో అమ్మవారిని తలుచుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.