కొలెస్ట్రాల్‌ను క‌రిగించే ఆల్‌బుకారా.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా?

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌శైలి, వ్యాయామాల‌కు దూరంగా ఉండ‌టం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంటారు.కొలెస్ట్రాల్ పెరిగిందీ అంటే.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా పెరిగింద‌ని అర్థం.అందుకే కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో ఆల్‌బుకారా పండ్లు కూడా ఒక‌టి.

ఎర్ర‌గా నిగ‌నిగ‌లాడుతూ నోరూరించే ఆల్‌బుకారా పండ్లు.వ‌ర్షా కాలంలోనే అత్య‌ధికంగా దొరుకుతాయి.

Advertisement

అలాగే రుచిలో తియ్య‌గా, పుల్ల‌గా, వ‌గ‌రుగా ఉండే ఆల్‌బుకారా పండ్ల‌లో.విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి ఆల్‌బుకారా పండ్లు ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ముఖ్యంగా ఆల్‌బుకారా పండ్ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే ఆల్‌బుకారా పండ్లను తీసుకోవ‌డం వ‌ల్ల‌.

ఇందులో ఉండే పోష‌క విల‌వ‌లు ఎర్ర ర‌క్త క‌ణాలు పెరిగిందేకు స‌హాయ‌ప‌డ‌తాయి.ఫ‌లితంగా ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు కూడా ఆల్‌బుకారాను తీసుకోవ‌చ్చు.వీటిని త‌గిన మోతాదులో తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Advertisement

ఆల్‌బుకారా పండ్ల‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు ఉండ‌టం వ‌ల్ల‌.వీటిని తీసుకుంటే ఎముక‌లు, దంతాలు ప‌టిష్ఠంగా మార‌తాయి.ఇక ఆల్‌బుకారా పండ్ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల రొమ్ము, గొంతు, నోటి క్యాన్సర్లు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మరియు ఈ పండ్లు తీసుకుంటే.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

తాజా వార్తలు