జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ వేలికి ఉంగరం ధరించిన వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసా..?

మన చేతి వేలికి ఉంగరాలు ధరించడం ఫ్యాషన్లో ఒక భాగమైపోయింది.కొందరు చేతి అందానికి ఉంగరాలు ధరిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం వారి జాతక రీత్యా వారికి సరిపడే రాళ్ళ ఉంగరాలు తయారు చేయించుకుని పెట్టుకుంటారు.

 Psychology Of A Person According To Astrology By Which Finger He Was Wearing The-TeluguStop.com

మరి కొందరు వారి ఇష్ట దైవం ఉన్నటువంటి ఉంగరాలను కూడా చేతి వేలుకు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేతి వేళ్లకు ఉంగరాలను బట్టి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో చెప్పవచ్చు.

ఈ విధంగా ఉంగరం పెట్టుకునే ఒక్కో వేలికి ఓ ప్రత్యేకత ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

చూపుడు వేలు:
కుడి చేయి చూపుడు వేలికి ఉంగరం ధరించిన వారిలో ఎల్లప్పుడూ ఆత్మగౌరవం, లీడర్ షిప్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటాయి.అదే గనుక ఎడమ చేతి చూపుడు వేలు ఉంగరం ధరిస్తే వారు ఇతరుల ప్రాధాన్యత ఆశిస్తున్నట్లు చెప్పవచ్చు.

మధ్యవేలు:

Telugu Astrology, Finger, Index Finger, Jaataka Chakra, Middle Finger, Pinky Fin

మధ్య వేలికి ఉంగరం ధరించడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.అయితే ఈ విధంగా మధ్యవేలుకు ఉంగరం ధరించిన వారు ఏ విషయాన్నైనా తొందరపడకుండా బాగా అర్థం చేసుకునే గుణం కలిగి ఉంటారు.

ఉంగరం వేలు:

Telugu Astrology, Finger, Index Finger, Jaataka Chakra, Middle Finger, Pinky Fin

మనలో చాలామంది ఉంగరం వేలుకు ఉంగరం పెట్టుకోవడం కనిపిస్తుంటుంది.ఈ విధంగా ఉంగరం వేలికి ఉంగరం ధరించిన వారు ఇతరులతో బంధం ఏర్పరచుకొని ఉన్నారని చెప్పవచ్చు.చాలామందికి వారి పెళ్లి ఉంగరాన్ని లేదా నిశ్చితార్థ ఉంగరాన్ని ఈ వేలికి పెట్టుకోవడం మనం చూస్తుంటాము.

చిటికెన వేలు:

Telugu Astrology, Finger, Index Finger, Jaataka Chakra, Middle Finger, Pinky Fin

చిటికెన వేలికి ఉంగరం ధరించిన వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెలుగుతారు.అందరిలో కన్నా వీరు ఎంతో తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు.అంతేకాకుండా కొన్ని ఆచారాలకు, మతాలకు ఇలాంటివారు దూరంగా ఉంటారు.

బ్రొటనవేలు:

Telugu Astrology, Finger, Index Finger, Jaataka Chakra, Middle Finger, Pinky Fin

బ్రొటనవేలు కి ఉంగరం ధరించిన వారు ఏ విషయం అయినా తన మనసులో పెట్టుకోకుండా బయటకు చెప్పేస్తారు.కుడి చేతి బొటన వేలికి ఉంగరం ధరించిన వారు కొన్నిసార్లు ఏదైనా విషయాన్ని తెలియజేయాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.అదే విధంగా ఎడమ చేతి బొటన వేలికి ఉంగరం ధరించిన వారు భయపడుతూనే వారి మనసులో ఉన్న మాట బయటకు చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube