పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టబోతున్న నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ పెళ్ళంట తీవ్ర విషాదాన్ని నింపింది.పుట్టింటి నుండి ఎంతో సంతోషంగా బయల్దేరిన వధువు మరణవార్త విని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.వివాహం జరిగి మూడు రోజులు మాత్రమే అయ్యింది.తన భర్తతో కలిసి బయల్దేరిన కారు రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడంతో వధువు అక్కడికక్కడే మృతి చెందింది.

 Up Bride Was Going To The In Laws House After Leaving Tractor Trolley Hits Died-TeluguStop.com

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెచీపురా గ్రామానికి చెందిన తన్మయ్ తో బధాపూర్ నివాసి అయిన పూజకు ఫిబ్రవరి 16 న వివాహం జరిగింది.పెళ్లి తర్వాత జరిగే పూజాకార్యక్రమాలు ముగించుకుని నవ వధూవరులు కారులో వరుడు ఇంటికి బయల్దేరారు.

వీరు ప్రయాణిస్తున్న కారు బిజ్నౌర్ సమీపంలోని నజీబాబాద్ వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురి అయ్యింది.వీరి కారును ట్రాక్టర్ ట్రాలీ బలంగా వచ్చి గుద్దడంతో వధువు అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వరుడుతోపాటు ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి కూడా గాయాలయ్యాయి.

Telugu Bijnor, Married, Pooja, Road, Tanmai, Trolley, Uttar Pradesh-Latest News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనలో తన్మయ్ తీవ్రంగా గాయపడడంతో అతడిని మరొక ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.కూతురుకి వివాహం జరిగిన మూడు రోజుల్లోనే మృత్యువాత పడడం తో ఆ పెళ్లింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు.

అయితే ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ట్రాలీ డ్రైవర్ ప్రమాదం తర్వాత అక్కడి నుండి వాహనం తో సహా పారిపోయాడు.

పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు.ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube