హైదరాబాద్ లో బయోడైవర్సిటీ వంతెనపై ఆ మధ్య ఓ కారు అతివేగంగా వెళ్లి వంతెనపై నుంచి క్రింద పడి ఓ మహిళ మృతికి కారణం అయిన సంగతి అందరికి తెలిసిందే.అంతకంటే ముందుగా బైక్ పై ఇద్దరు కుర్రాళ్ళు వేగంగా వెళ్లి క్రింద పడి చనిపోయారు.
ఈ రెండు ఘటనల నేపధ్యంలో బయోడైవర్సిటీ వంతెన డిజైన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మందికి లబ్ది చేకూర్చే ప్రయత్నంలో భాగంగా వంతెన డిజైన్ మార్చిందని విపక్షాలు విమర్శించాయి.
ఈ నేపధ్యంలో వంతెన నిర్మాణం గురించి పరిశీలించడానికి జీహెచ్ఎంసి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
వంతెన ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మీడియాతో పంచుకున్నారు.
నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని అన్నారు.వంతెన నిర్మాణం కేవలం గంటకు 40కిమీ వేగంతో వెళ్లేందుకు నిర్మించడం జరిగిందని తెలిపారు.
కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన,.ప్రభుత్వ అనుమతి రాగానే వంతెన తిరిగి ప్రారంభిస్తామని కమిషనర్ వివరించారు.
కారు అతివేగం కారణంగానే ఆ ప్ఇరమాదం జరిగిందని, దానిలో కారుని నడిపిన వ్యక్తిదే తప్పని చెప్పారు.