అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే చిత్రం రూపొందబోతున్నట్లుగా ఆ మద్య అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ఇప్పుడు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
పింక్ రీమేక్‌కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ మూవీ చేయబోతున్న వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాను పక్కకు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.
ఐకాన్ మూవీ టైటిల్‌ను ఇప్పుడు బాలయ్య వినియోగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
నందమూరి బాలకృష్ణ ఈవారం రూలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ వెంటనే బోయపాటి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు బాలయ్య సిద్దం అయ్యాడు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.సంక్రాంతికి ముందే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తి అయ్యాయి.
ఇక ప్రస్తుతం టైటిల్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్రాజును బోయపాటి ఐకాన్ టైటిల్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.గతంలో వచ్చిన సింహా మరియు లెజెండ్ చిత్రాల టైటిల్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉండటంతో సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు ఐకాన్ సినిమా టైటిల్ కూడా సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుందని అందుకే చాలా రిక్వెస్ట్‌గా దిల్రాజును బోయపాటి అడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.మరి దిల్‌రాజు ఐకాన్‌ను ఇస్తాడా చూడాలి.