మన ఇళ్లల్లో దీపారాధన చేయడం సర్వ సాధారణంగా చూస్తుంటాం.అయితే ఏరకమైన నూనెను దీపారాధనకు వాడాలనే దానిపై కూడా కొన్ని సూచనలను నిపుణులు, పండితులు సూచిస్తున్నారు.
నువ్వుల నూనెను దీపారాధనకు వాడితే, మనకున్న అన్నిరకాల గ్రహ దోషాలు పోతాయని అంటున్నారు.ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే, కోరికలు నిదానంగా తీరుతాయి.
అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఏమాత్రం దోషం కాదు.
ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో గల కోరికలు త్వరితగతిన తీరతాయని చెబుతున్నారు.
కానీ ఆవునెయ్యితో దీపం శ్రేష్టం.ఖర్చు ఎక్కువ వలన, దొరకక పోవడం వంటి కారణాల వలన ఆవునెయ్యి తో దీపాన్ని తమ ఇష్ట దేవత, ఇలవేల్పు ఎదుట కనీసం వారానికి ఒకసారి పెట్టినా కూడా మంచిదే.
కాగా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ప్రతినిత్యం చేయవచ్చు.గణపతి ఎదుట, కులదేవత ఎదుట కొబ్బరి నూనె దీపారాధన మనకు మంచి ఫలితాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.
ఇక ఎంత సంపాదించినా సరే, కొందరికి తీవ్రమైన రుణ బాధలు వెంటాడుతుంటాయి.ఎక్కువ సంపాదన వచ్చినా సరే, వడ్డీలకు ,అప్పులు కట్టడానికి సరిపోతుంది.ఇక కొందరు గృహ నిర్మాణానికో మరో దానికో పెద్ద మొత్తంలో అప్పులు చేసి, తీర్చగలమో లేదో అని భయపడతారు.ఇలాంటి వారందరూ వీలయితే గంధం నూనెతో దీపారాధన చేస్తే మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
తమ ఇష్ట దేవత ముందుగానీ, కులదేవత ముందుగానీ, ఇలవేల్పు ఎదుట గానీ, మహాలక్ష్మి అమ్మవారి ఎదుట గానీ గంధం నూనెతో దీపారాధన చేస్తే, రుణబాధలు తొలగిపోతాయి.