మహాలక్ష్మి స్వరూపం అయిన తులసి అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం.శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనాడు.
మన సనాతన ధర్మంలో తులసికి ఒక ప్రత్యేక స్థానం మరియు అనేక రకాలుగా స్తుతించారు.అలాగే తులసి చెట్టు కళావిహీనమని చెప్పారు.
ప్రతి రోజు తులసి దగ్గర దీపం పెట్టాలి.
తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
హిందూ మతంలో తులసికి ఒక విశిష్టమైన స్థానంఉంది .తులసికి ఆధ్యాత్మికంగాను,ఆరోగ్యపరంగాను ప్రయోజనాలు ఉన్నాయి.తులసి మొక్కను హిందువులు కోటలో పూజించటం మనం చూస్తూనే ఉంటాం.తులసి ఉన్న ఇల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతుందని హిందువుల నమ్మకం.
ప్రతి రోజు తులసి మొక్కకు దీపం పెట్టి,నీటిని పోసి ప్రదక్షిణ చేయాలి.ఇలా చేయటం వలన చెడు తొలగిపోయి మంచి జరుగుతుంది.
మనం అనుకున్న పనులు నెరవేరతాయి.తులసి వనం ఉన్న ఇల్లు ఒక పుణ్య తీర్థంతో సమానం అని మన పురాణాలు చెపుతున్నాయి.
అలాగే ఇంటిలో తులసి మొక్క ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు రావు.