నాట్యం చేసే వారు తమ నాట్యాన్ని ప్రారంభించటానికి ముందు తల్లిదండ్రులకు, గురువులకు, అతిథులకు నమస్కరిస్తారు.ఆ తర్వాత
సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే |
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదఘాతం క్షమస్వమే||
అంటూ భూదేవికి నమస్కారం చేస్తారు.
అంటే సాక్షాత్తు విష్ణు పత్ని అయిన అమ్మ వారిపైన పదఘట్టనలు చేస్తున్నందుకు క్షమాపణ కోరుకుంటారు.ఇది సాధారణంగా ప్రచారం లో ఉన్న విషయం.
కానీ నాట్యానికి ముందు భూదేవికి నమస్కరించడానికి మరో ఆసక్తి కరమైన అద్భుతమైన కారణం ఉంది.
పరమ శివుడు సంధ్యా నాట్యం చేస్తున్నప్పుడు నంది తన వీపుని వేదికగా పరిచాడు.
ఆ వేదికపై శివుడు మైమరచి నాట్యం చేసారు.ఆ నటరాజ పూజ అయిన నాట్యాన్ని చేసే ముందు, ఆయన నర్తించడానికి తన వీపును రంగస్థలం గా చేసిన నందికి ప్రథమ నమస్కారం చేస్తారు.
శివపూజలో నందికి ప్రథమ నమస్కారం చేయడం అందరికీ తెలిసిన విషయమే.అందుకే దాన్ని ‘నాంది’ అంటారు.
ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ‘నాంది పలకడం’ అన్న మాట ఇక్కడినుంచే వచ్చింది.నాట్యం చేసేముందు భూమికి నమస్కరించడం వెనుక గల ప్రధాన కారణం ఇదే.