అర్హత పరీక్షకు హాజరుకానున్న 429 మంది యువత -ఎస్పీ రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పోలీసు ముందస్తు శిక్షణ కోసం అభ్యర్థుల అర్హత పరీక్షలో పిజికల్ టెస్ట్ నందు అర్హత పరీక్షకు ఎంపికైన 429 అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు ముందస్తు ఉచిత శిక్షణకుగాను సూర్యాపేట జిల్లా పోలీసు అధ్వర్యంలో జరిగిన దేహదారుఢ్య పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు తేదీ:13/04/2022 అనగా బుధవారం రోజున అర్హత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లా కేంద్రంలోని ఎస్.వి.డిగ్రీ కళాశాల యందు పరీక్షా కేంద్రం ఏర్పటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని,అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందు అనగా 9 గంటలకే చేరుకోవాలని సూచించారు.

ఫిజికల్ టెస్ట్ నందు అర్హత సాధించి రాత పరీక్షకు హాల్ టికెట్ పొందిన అభ్యర్థులు 13 వ,తేదీ ఉదయం 9 గంటల వరకు ఎస్.వి.డిగ్రీ కళాశాల నందు హాజరు కావాలన్నారు.హాల్ టికెట్ నంబర్ ఆధారంగా పరీక్ష గదులు ఏర్పాటు చేస్తున్నామని,పరీక్ష 200 మార్కులకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ఓఎమ్ఆర్ నందు జవాబులు గుర్తించాలని,బాల్ పాయింట్ పెన్ ను ఉపయోగించాలని వివరించారు.దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని,రాత పరీక్ష నందు అర్హత పొందిన వారికి ముందస్తు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

పరీక్షకు 429 మంది అభ్యర్థులు అర్హత సాధించడం పట్ల వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా వారిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

Advertisement
ఇండియా vs పాక్ మ్యాచ్ : పాకిస్థాన్ యువతి మెడలో ఉన్నది చూసి అంతా షాక్..?

Latest Suryapet News