గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన సర్పంచ్...!

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్)( Thirumalagiri (Sagar) ) మేజర్ పంచాయతీ సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి ( Shravan Kumar Reddy )శనివారం బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి రాజీనామా చేశారు.

గ్రామంలో బీసీబంధు( BC Bandhu ), గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో తన ప్రమేయంలేకుండానే చేశారనే అసంతృప్తితో ఉన్నారు.

ఆదివారం 200 బైక్ ర్యాలీతో హాలియాలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్ మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షులు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

మండలంలో మరి కొంతమంది సర్పంచులు కూడా కాంగ్రెస్ నాయకుల టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Nalgonda News