మోటకొండూరులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకోండూర్ మండల కేంద్రంలో ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ (Yuvajana Congress )ప్రధాన కార్యదర్శి బుగ్గ మహేష్ (Mahesh Bugga ) ఆధ్వర్యంలో 64వ,యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,ఎన్నికల హామీ ప్రకారంగా యువతకి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.యువతకు అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి యువజన కాంగ్రెస్ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందన్నారు.

Yuvajana Congress Grand Celebration In Motakondu, Yuvajana Congress, Motakondu,

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగు శేఖర్, జూకంటి మధు,జంగవెళ్లి రాజశేఖర్,అద్ధమడుగు నాగరాజు,బాల్ద మధు, గవ్వల సిద్ధులు,కోల్లూరి రంజిత్,మల్గ రమేష్,రేగు మణి,బుగ్గ మహేందర్, మండల ఉపాధ్యక్షుడు భూమండ్ల అశోక్,జిల్లా నాయకులు భూమండ్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమండ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

Latest Latest News - Telugu News