టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వార్ కు సిద్ధం అవుతున్న కొత్త టీమ్ వీరే..!

ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.

 Young Actors Pan India Films, Nani, Pan India Film, Dasara Movie, Mahesh Babu, R-TeluguStop.com

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.

మహేష్ బాబు ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేయబోతున్నాడు.

అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఇలా స్టార్ హీరోలు దాదాపు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతున్నారు.ఇక వీరు బ్యాచ్ అయిపోవడంతో ఇప్పుడు మరో కొత్త టీమ్ పాన్ ఇండియా రేస్ లోకి వచ్చింది.

మరి ఆ కొత్త బ్యాచ్ లో పాన్ ఇండియా పోటీలో ఉన్న వారు ఎవరో తెలుసుకుందాం.

ఈ లిస్టులో ముందు వారిలో ఉంది విజయ్ దేవరకొండ.

ఈయన లైగర్ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Telugu Dasara, Mahesh Babu, Nani, Pan India, Rashmika, Youngactors-Movie

ఇక విజయ్ తర్వాత రష్మిక మందన్న ఈ లిస్టులో ఉంది.ఈమె ఇప్పటికే పుష్ప సినిమాతో ఆల్ మోస్ట్ పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.ఇక ఈమె ఇప్పుడు మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో పూర్తి స్థాయిలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఆ తర్వాత నాగ చైతన్య కూడా బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తున్నాడు.ఈయన నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కు రెడీ అవుతుంది.అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది.

దీంతో చై కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచుకోనున్నాడు.

Telugu Dasara, Mahesh Babu, Nani, Pan India, Rashmika, Youngactors-Movie

ఇక ఈ లిస్టులో అడవి శేష్ కూడా ఉండనున్నారు.ఈయన నటించిన మేజర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాతో అడవి శేష్ పాన్ ఇండియా యాక్టర్ గా మారనున్నాడు.

ఆ తర్వాత నాని కూడా ఈ లిస్టులో ఉన్నాడు.నాని దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో నాని పాన్ ఇండియా స్టార్ గా మారాలని ట్రై చేస్తున్నాడు.మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube