జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసిపి ఎంపీ హైకోర్టులో పిటిషన్..!! 

ఇటీవల తిరుపతిలో బీజేపీ నేత సునీల్ దియోధర్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది అంటూ సంచలన కామెంట్ చేయటం తెలిసిందే.

అలా కామెంట్ చేసిన కొద్దిరోజుల్లోనే వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ తాజాగా హైకోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

మేటర్ లోకి వెళితే ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టు లో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.  తాజాగా ఈ విషయాన్ని ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలియజేశారు.

YCP MP Files Petition In High Court Seeking Revocation Of Jagan's Bail Raghu Ram

తమిళనాడు రాష్ట్రంలో జయలలిత, బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ మాదిరిగా స్టాండ్ బై ముఖ్యమంత్రిని ఎవరైనా పెట్టుకొని జగన్ ట్రైల్ కేసులు ఎదుర్కోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.ఇటీవల మహారాష్ట్ర హోం శాఖ మంత్రి సిబిఐ విచారణలో భాగంగా తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని పిటిషన్లో గుర్తు చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో 11 సీబీఐ ఛార్జిషీట్లో ఏ వన్ గా ఉన్న జగన్ .కోర్టు వాయిదాలకు హాజరు కాలేక పోతున్నారు నేపథ్యంలో ఆయనపై అభిమానంతో పార్టీపై గౌరవంతో హైకోర్టులో ఈ విధంగా బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.  .

Advertisement
మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?

తాజా వార్తలు