Yandamuri Veerendranath : ఈ తరం యువకులకు ఒక యండమూరి అవసరం !

ప్రముఖ నవలా రచయిత, స్క్రీన్‌రైటర్ యండమూరి వీరేంద్రనాథ్( Yandamuri Veerendranath ) గురించి స్పెషల్ గా చెప్పనక్కరలేదు.

ఆయన రాసిన విజయానికి ఐదు మెట్లు నవల ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆయన రాసిన ఒక్క నావెల్ చదివితే చాలు చదవడం పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది.అంత బాగా రాయడంలో ఆయనకు ఆయనే సాటి.

సమాజంలో ఉన్న చాలా సమస్యల గురించి కూడా అతను రచనలు రాస్తారు.అవన్నీ కూడా చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి.నిన్నటితో 74 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన యండమూరి వీరేంద్రనాథ్ యువ వయసులో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులు కూడా పూర్తి చేశారు.

తూర్పు గోదావరిలో పుట్టిన వీరేంద్రనాథ్ సినిమాల్లో కూడా పనిచేశారు.కొందరు మాత్రం ఆయనది ఖమ్మం అంటారు.నిజానికి వీరేంద్రనాథ్ చాలా సార్లు ఖమ్మం జిల్లాకు వచ్చారు.

Advertisement

పాఠశాలలకు వెళ్లి మాట్లాడారు.

ఒకసారి ఖమ్మం గర్ల్స్ హైస్కూల్‌కు వెళ్లిన ఆయన త్రిపురనేని గోపిచంద్( Tripuraneni Gopichand ) తనకు ఆదర్శం అన్నారు."గోపిచంద్ మూడు ఫ్లాప్‌ సినిమాలు తీసాడు, నేను రెండు తీసా, ఇంకా ఒకటి తీయాల్సి ఉంది.” అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ తర్వాత ఆటోగ్రాఫ్‌ల కోసం కొందరు బారులు తీరారు.ఆ సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ ఒకరి పెన్ను అడిగారు.

దానిని మళ్లీ తిరిగి ఇచ్చేది లేదని కూడా ఆ అభిమానికి చెప్పారు.ఆ అభిమాని పేరు అడిగి తెలుసుకున్నారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఆ నేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకున్నారు.నా పేరును నెక్స్ట్ తన నవలలో వాడతానని కూడా అభిమానికి హామీ ఇచ్చారట కానీ దానిని వాడుకోలేదట.

Advertisement

ఏదేమైనా యండమూరి వీరేంద్రనాథ్ వల్ల ఒక తరం యువత చదవడం అలవాటు చేసుకున్నారు.కానీ ఇప్పటి తరం యువత మొబైల్ ఫోన్స్, యూట్యూబ్ వీడియోలు, ఓటీటీ కంటెంట్ చూడడానికే పరిమితం అవుతున్నారు.

వారిని బుక్స్ వైపు లాగే రచయితలు కూడా తక్కువ అవుతున్నారు.ఇలాంటి సమయంలో యువతలో చదివే ఆసక్తి రగిలించే ఒక యండమూరి తప్పనిసరిగా అవసరమని చెప్పొచ్చు.

ఇక యండమూరి వీరేంద్రనాథ్ ఇంగ్లీషు నవలలను కూడా తెలుగులో రాశారు.వాటిపై విమర్శలు ఉన్నాయి కానీ తన వంతుగా పాఠకులను బుక్ రీడింగ్ నుంచి డైవర్ట్ చేయకుండా చేయడంలో చాలా పాత్ర పోషించారు.

సాంఘిక నవలను డిటెక్టివ్ నవలగా, వ్యక్తిత్వ వికాస రచనను కూడా థ్రిల్లింగ్గా రాయగల యండమూరి లాంటి రైటర్ మనందరికీ అవసరం.

తాజా వార్తలు