తన చరిత్రను తానే రాసుకోవడం ఒక పరవశం...!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న గ్రామాల పురోభివృద్ధిని ఈ తరం విద్యార్థులు మన ఊరు -మన చరిత్ర పేరున నమోదు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.

ఆదివారం కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో చిలుకూరులో జరిగిన మన ఊరు-మన చరిత్ర క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లడుతూ విద్యార్థులు తన ఊరు చరిత్ర తానే రాయడం ఒక అనుభూతి అన్నారు.

నిజాం కాలం నుంచి నేటి వరకు తెలంగాణ పల్లెలు తమ సామాజిక జీవనంలో మత సామరస్యంతో ఎలా వర్ధిల్లుతున్నాయో ఈ తరం విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారని చెప్పారు.చిలుకూరు లాంటి చైతన్యవంతమైన ప్రాంతంలో జరిగిన ప్రజా పోరాటాలు,సాయుధ పోరాటాల చరిత్రలో చిలుకూరు పాత్ర, తెలంగాణ రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమాలలో చిలుకూరు పాత్రలను మన ఊరు-మన చరిత్రలో ఎక్కబోతున్నాయని తెలిపారు.

తెలుగు భాష కోసం ఈ ప్రాంతంలో జరిగిన గ్రంథాలయ ఉద్యమాల మహోన్నత పాత్రను ఈ కార్యక్రమం ద్వారా మరొక్కసారి మననం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ ఏదో ఒక కులానికి వ్యతిరేకంగానో,ఏదో ఒక మతానికి వ్యతిరేకంగానో జరగలేదని వివరించారు.

మన ఊరు-మన చరిత్ర కార్యక్రమం ద్వారా తన ఊరి మట్టి గొప్పతనాన్ని విద్యార్థులు తమ కలాలతో రాస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ రాజేశ్వరి, ఎస్ఐ శ్రీనివాస యాదవ్, ఆర్ఐ భవాని,మన ఊరు- మన చరిత్ర జిల్లా కో ఆర్డినేటర్ నిర్మలా కుమారి, "తెర" సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు,తెలుగు ఉపన్యాసకులు వేముల వెంకటేశ్వర్లు,పరిశోధన విద్యార్దులు,సౌజన్య, భవాని,మంజు,వినోద్, ప్రవీణ్,హరికృష్ణ,సర్పంచ్ కొడారు వెంకటేశ్వర్లు, దొడ్డా సురేశ్,ఎంపిటిసి కల్యాణి కోటేష్,సింగిల్ విండో చైర్మన్ అలసాగాని జనార్ధన్,కస్తూరి సైదులు, కస్తూరి నర్సయ్య,అంబాల వెంకటేశ్వర్లు,కోడారు వెంకటయ్య,కృష్ణయ్య, చలమయ్య,లక్ష్మణరావు, భిక్షం,ప్రభాకర్,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Latest Suryapet News