సూర్యాపేట ముఖ ద్వారం ఎన్టీఆర్ పార్క్ చౌరస్తాకు ధర్మభిక్షం పేరు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణ ముఖ ద్వారమైన ఎన్టీఆర్ పార్క్ చౌరస్తాకు ధర్మ బిక్షం చౌక్ గా నామకరణం చేస్తూ ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం ధర్మ భిక్షం 12వ వర్ధంతి సందర్భంగా జరగిన వేడుకల్లో మంత్రి పాల్గొని అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 Suryapet Mukha Dwaram Ntr Park Square Named Dharmabhiksham Minister Jagdish Redd-TeluguStop.com

అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మ భిక్షం ను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత అన్నారు.సూర్యాపేట పేరు ప్రతిష్టలను దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహనీయుడు ధర్మభిక్షం అని,సూర్యాపేట మాజీ శాసన సభ్యులు,నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులుగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియడారు.

చదువుతోనే జీవితానికి వెలుగని నమ్మిన నేత ధర్మ భిక్షం అన్నారు.

ప్రజల కోసమే జీవితాన్ని ధారాదత్తం చేసిన నాయకుడని,ధర్మ భిక్షం జీవితం భావితరాలకు స్పూర్తిదాయకం అన్నారు.

కల్లుగీత కుటుంబంలో జన్మించిన ధర్మభిక్షం కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రమించారని,దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి వారి హక్కుల కోసం పోరాడారని,ఆయన సాగించిన కృషి ఫలితంగానే ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అమలులోకి వచ్చిందనిగుర్తు చేశారు.ప్రజా ఉద్యమ క్షేత్రంలోను, చట్టసభల్లోనూ పేదల పక్షాన నిలబడి,వారి తరఫున కలబడిన ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,పట్టణ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారయణ,బూర బాలసైదులు గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బైరు వెంకన్న గౌడ్,కక్కిరేని నాగయ్య గౌడ్,చేనగాని రాంబాబు గౌడ్,యూత్ నాయకులు ఎల్గురి రాంబాబు,గుండపునేని కిరణ్,అనంతుల విజయ్, దేశగానీ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు లక్ష్మి కాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, అనతుల యాదగిరి గౌడ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube