ఆహా ఏమి ట్రిక్కు గురూ.. సూట్‌కేసులతో బైక్ రైడ్.. థాయ్‌లాండ్‌లో టూరిస్ట్ తెలివైన ఐడియా!

థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ (Thailand trip plan)చేస్తున్నారా, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారా అయితే ఈ ట్రావెల్ ట్రిక్ మీకు బాగా పనికొస్తుంది.

లగేజీ మోయడానికి క్యాబ్ బుక్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక టూరిస్ట్ ఓ సూపర్ ఐడియా కనిపెట్టాడు.

అది అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.‘థాయ్‌ట్రావెల్‌టిప్స్’ (‘ThaiTravelTips’)అనే ఇన్‌స్టా పేజీలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

అందులో ఒక వ్యక్తి రెండు పెద్ద సూట్‌కేసులు(Suitcases) పెట్టుకుని బైక్ మీద కూర్చుని రైడ్ చేస్తున్నాడు.నైట్ టైమ్ లో తీసిన ఈ క్లిప్‌లో, అతను బిజీ రోడ్డులో కూల్ గా వెళ్తున్నాడు.

అసలు ట్విస్ట్ ఏంటంటే లగేజీ క్యారీ చేసే స్టైల్.సూట్‌కేసులకు ఉన్న చక్రాలను వాడి, బైక్ కి ఇరువైపులా శాడిల్‌బ్యాగుల్లా బ్యాలెన్స్ చేశాడు.

Advertisement
Thailand Travel Hack, Bike Suitcase Transport, Cheap Thailand Travel, Budget Tra

అంతే కాదు, భుజానికి ఒక రెడ్ స్లింగ్ బ్యాగ్ కూడా వేసుకున్నాడు.బైక్‌పై అన్ని వస్తువుల్ని ఇంత ఈజీగా మేనేజ్ చేయడం చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

థాయ్‌లాండ్‌లో టాక్సీలు, క్యాబ్‌లకు(taxis and cabs) బదులుగా బైక్‌లు చాలా చీప్ అంట.ముఖ్యంగా బడ్జెట్ ట్రావెలర్స్‌కి ఇది బాగా యూజ్ అవుతుంది.ఈ టూరిస్ట్ బైక్ వాడడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు బాగా తగ్గించుకున్నాడు.

Thailand Travel Hack, Bike Suitcase Transport, Cheap Thailand Travel, Budget Tra

ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు, ఇంప్రెస్ అయిపోతున్నారు.ఈ క్రియేటివ్ ట్రిక్‌కి (creative trick)అందరూ ఫిదా అయిపోయారు.ఒక యూజర్ "జీనియస్" అని కామెంట్ చేస్తే, ఇంకొకరు "ఐ లైక్ ఇట్" అంటూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాకి అప్రిషియేట్ చేశారు.

ఈ వీడియోకి ఇప్పటికే 8,499 వ్యూస్ వచ్చాయ్, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.డబ్బులు సేవ్ చేసుకోవడానికి, ట్రిప్‌ను చీప్ గా ప్లాన్ చేసుకోవడానికి ట్రావెలర్స్ కొత్తగా ఎలా ఆలోచించొచ్చు అనేదానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!
ఎఫ్‌బీఐలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. ఎవరీ షోహిణి సిన్హా?

సో, మీరు కూడా థాయ్‌లాండ్ వెళ్తున్నారా? అయితే ఈ వెరైటీ లగేజ్ ట్రిక్ ట్రై చేయొచ్చు.

Advertisement

తాజా వార్తలు