Gymnastics :చీరలో జిమ్నాస్టిక్స్ చేస్తున్న మహిళ.. వీడియో వైరల్…

సాధారణంగా చీరకట్టులో పరిగెత్తడమే కష్టం.ఇక గాలిలో విన్యాసాలు చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

కానీ కొందరు మహిళలు చీరకట్టులోనూ అద్భుతమైన భౌతిక విన్యాసాలు చేస్తూ వావ్ అనిపిస్తున్నారు.తాజాగా ఓ మహిళ చీరకట్టులో జిమ్నాస్టిక్స్( Gymnastics ) చేస్తూ ఆన్‌లైన్‌లో పలువురిని ఆకట్టుకుంది.

చీర సరిగ్గా కట్టుకోవడం అంత సులువు కాదు, దానిని సరిగా కట్టుకోకపోతే ఊడిపోతుంది.ఇక జిమ్నాస్టిక్స్ వేసేటప్పుడు చీర ఒంటి మీద ఉండేలా చూసుకోవడం చాలా కష్టం.

కానీ ఈ మహిళ తనకు అదేదో వెన్నతో పెట్టిన విద్య లాగా జిమ్నాస్టిక్స్ చేసింది.

Advertisement

వీడియోలో మహిళ పింక్ శారీ, నారింజ బ్లౌజ్‌ దారించే కనిపించింది.ఆమె పోల్ వాల్ట్‌పై జిమ్నాస్టిక్ స్టంట్స్ చేసింది.ఈ ఎత్తైన బార్‌పై ఆమె ముందుకి వెనకకి ఊగుతూ, మధ్య మధ్యలో పోల్ ను వదిలేస్తూ అటు ఇటు వెళ్తూ భలే ముచ్చటగా మూవ్‌మెంట్స్ చేసింది.

చీర తన కదలికలకు కొంచెం కూడా అంతరాయం కలిగించలేదు.ఆమె చాలా వేగంతో, నైపుణ్యంతో పోల్‌పై తిరుగుతుంది.ప్రొఫెషనల్ జిమ్నాస్ట్ లాగా కనిపిస్తుంది.

ఈ వీడియోను కైరవి రాజ్‌పుత్( Kairavi Rajput ) అనే యూజర్ ఫిబ్రవరి 19న X అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసారు.ఒకవేళ ఆ మహిళ తెల్లటి చీర కట్టుకుని ఉంటే చచ్చేంత భయంగా అనిపించి ఉండేదని యూజర్ చమత్కరించారు.ఎందుకంటే భారతీయ సంస్కృతిలో తెల్ల చీరలు ( White saree )తరచుగా దెయ్యాలతో ముడిపడి ఉంటాయి.

షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది.దీనికి ఐదు లక్షల కంటే ఎక్కువ వ్యూస్, సుమారు 8 వేల లైక్‌లు వచ్చాయి.ఈ వీడియోపై చాలా మంది తమాషా కామెంట్స్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

రాత్రిపూట తెల్లటి చీరలో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వారిని చూస్తే భయమేస్తుందని, గుండెపోటు కూడా వస్తుందని కొందరు చెప్పారు.మరికొందరు క్రష్‌లను ఆకట్టుకోవడానికి మాత్రమే జిమ్నాస్టిక్స్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.

Advertisement

చీరకట్టులో జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటని, అందుకు ప్రత్యేక పోటీ ఉందా? అని కూడా కొందరు అడిగారు.అయితే, ఓ వ్యక్తి ఆ మహిళ బలాన్ని మెచ్చుకున్నాడు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మీమ్స్‌కి కూడా దారితీసింది.

తాజా వార్తలు