తెలంగాణ లో ఎన్నికల హీట్ చివరి దశకు చేరుకుంది.మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారలపై మరింత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి.
ముచ్చటగా మూడో సారి అధికారం కోసం బిఆర్‌ఎస్ పోటీ పడుతుంటే.బిఆర్‌ఎస్ ను గద్దె దించే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కథం తొక్కుతున్నాయి.
గత తొమ్మిదేళ్లగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అభివృద్ది జరిగిందని, ఈ అభివృద్ది ఇలాగే కొనసాగలంటే మల్లిఊ కేసిఆర్ పాలనే రావలనే నినాదంతో బిఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది.అటు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఎజెండాగా చూపిస్తూ.
కేసిఆర్ పాలనలో ఎక్కకు మించి అవినీతి జరిగిందని రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని హస్తం నేతలు తెగ హడావిడి చేస్తున్నారు.
అటు బీజేపీ కూడా జాతీయ నేతలతో ప్రచారంలో దూకుడు పెంచింది, నిన్న మొన్నటి వరకు అంతర్గ విభేదాలతో సతమతమైన కమలం పార్టీ ప్రస్తుతం ఎన్నికల ముందు అవన్నీ పక్కన పెట్టి ప్రచారంపై దృష్టి పెట్టింది.
డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో కమలం పార్టీ ముందుకు సాగుతోంది.ఇక మూడు ప్రధాన పార్టీలు కూడా నిర్తిష్టమైన లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలవడంతో ఈసారి ఎలక్షన్ ఫైట్ రసవత్తరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్యనే అసలు పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.గత మూడు నెలల్లో హస్తం పార్టీ అందుకున్న జోరు మామూలుగా లేదు.
ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం తెలంగాణలో ఆ పార్టీకి బాగానే మేలు చేసినట్లు కనిపిస్తోంది.కర్నాటక హామీలే ఇక్కడ కూడా ప్రకటించడం తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించిన సంచలనమే అవుతుంది.బిఆర్‌ఎస్ మరోసారి గెలిస్తే సౌత్ లోనే మూడో సారి అధికారం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న నేతగా కేసిఆర్ రికార్డ్ సృఃటించనున్నారు.
అటు కాంగ్రెస్ గాని బీజేపీగాని గెలిస్తే.బిఆర్‌ఎస్ తరువాత గెలిచిన ఇతర పార్టీగా కొత్త చరిత్రను తిరగరాసే అవకాశం ఉంది.మరి తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి అవకాశమిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఎదురు చూడాల్సిందే.