‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఈసారి ఎలిమినేట్ అయేది ఎవరో.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ అప్పుడే నాలుగో వారానికి చేరింది.

హౌస్ నుంచి ఆల్రెడీ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు కూడా.

ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఈసారి నాల్గో వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అనే చర్చ షురూ అయింది.

ఫస్ట్ వీక్‌లోనే సరయు ఎలిమినేట్ కాగా, సెకండ్ వీక్‌లో ఉమాదేవి, థర్డ్ వీక్‌లో ‘లేడీ అర్జున్ రెడ్డి’ లహరి ఎలిమినేట్ అయింది.దాంతో ఇక ఈ సారి నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్ అత్యంత ఆసక్తికరంగా సాగాయి.హౌస్ మేట్స్ మధ్య గొడవలతో పాటు మాటల యుద్ధమే జరిగింది.

Advertisement
Who Will Be Eliminated From Bigg Boss House This Week , Sunny, Siri, Kajal, Priy

మొత్తంగా ఈ వారానికి బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న మందిలో సగం అనగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి.వారు ఎవరంటే.

సన్నీ, సిరి, కాజల్, ప్రియ, రవి, లోబో, యానీ, నటరాజ్.

Who Will Be Eliminated From Bigg Boss House This Week , Sunny, Siri, Kajal, Priy

‘బిగ్ బాస్’ హౌస్‌లో ఈ ఎనిమిది మందితో పోల్చితే మిగతావారు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు పలవురు అంచనా వేస్తున్నారు.అయితే, ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబో డెఫినెట్‌గా ఉంటారనే చర్చ ఉంది.ప్రేక్షకులు కూడా ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని ఆసక్తి కనబరుస్తుండగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్నది.

ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిలే ఎలిమినేట్ కాగా ఈసారి అబ్బాయి ఎలిమినేట్ అవుతాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ గురించి పోస్టులు పెడుతున్నారు.లోబో విషయానికొస్తే అతడు టాస్కులు సరిగా ఆడకపోవడం అతడి మైనస్ అని అంటున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

యానీ మాస్టర్ ఇంట్లో ప్రతీ ఒక్కరితో బాగానే ఉంటుందని, కానీ, నామినేషన్స్ సందర్భంగా ఆమె చెప్పే రీజన్స్ ఇబ్బంది తెచ్చి పెడతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సారి అందరి కంటే ఎక్కువ డేంజర్ జోన్‌లో ఉంది నటరాజ్ మాస్టర్ అని మరికొందరు పేర్కొంటున్నారు.

Advertisement

అయితే, ముగ్గురిలో ఒక్కరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ ముగ్గురు కాకుండా ఎనిమిది మంది ఎలిమినేట్ కావొచ్చని ఇంకొందరు అంటున్నారు.

తాజా వార్తలు