గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో( Tollywood industry ) పాటు మిగిలిన అన్ని సినిమా ఇండస్ట్రీలను వేధిస్తున్న సమస్య ట్రోలింగ్, బ్యాడ్ పబ్లిసిటీ.

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యాడ్ పబ్లిసిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంది.

తాజాగా విడుదల అయిన గేమ్ చేంజర్ సినిమాతో అది మరొకసారి ప్రూవ్ అయింది.అయితే ఈ బ్యాడ్ పబ్లిసిటీ స్టార్ హీరోలతో సినిమా తీస్తున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ( directors , producers )అయితే పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయింది.

స్టార్‌ వార్ పీక్‌ కు చేరటం తమ హీరోకు మరో హీరోకు గిట్టదని ఫ్యాన్స్ రెచ్చిపోతుండటంతో ప్రొడ్యూసర్లు నిండా మునుగుతున్నారు.ఫస్ట్ షో పడక ముందే బ్యాడ్ పబ్లిసిటీ చేయడం, రిలీజ్ తర్వాత నెగిటివ్ రివ్యూలు రావడంతో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్‌ లుగా నిలుస్తున్నాయని అంటున్నారు.

కొందరు హీరోల ఫ్యాన్స్ అయితే పనిగట్టుకుని మరీ నెగెటివ్ ప్రాపగండ చేస్తున్నారట.

Who Gave Negative Publicity To Game Changer, Negative Publicity, Game Changer, T
Advertisement
Who Gave Negative Publicity To Game Changer, Negative Publicity, Game Changer, T

ఇటీవల కాలంలో ప్రేక్షకులు కూడా సీనియర్ సినిమా రివ్యూల( Senior Movie Reviews ) కంటే మౌత్ టాక్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమా థియేటర్లకు వెళ్లడం కూడా మానేశారు.దీంతో ఈ ఎఫెక్ట్ కాస్త మూవీ మేకర్స్ పై గట్టిగానే పడుతోంది.అంతో ఇంతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవలసిన సినిమాలు కూడా ఊహించని విధంగా బ్యాడ్ టాక్స్ తో బోల్తా కొడుతున్నాయి.

దీంతో ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడూ నోరు విప్పని నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ లో సంచలనం రేపాయి.జనవరి 10 న గేమ్‌ ఛేంజర్ సినిమా ( game changer movie )రిలీజ్ అయింది.

దిల్‌రాజు ( Dil Raju )తన బ్యానర్‌ లో నిర్మించిన సినిమాల్లో ఏ మూవీకి కూడా ఈ స్థాయిలో బడ్జెట్, టైమ్ కేటాయించలేదు.ఈ సినిమాలో సాంగ్స్‌ కు అయిన ఖర్చుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా( Sankrantiki vastunnam movie) కంప్లీట్ చేశారంటే గేమ్‌ ఛేంజర్‌ పై ఎంత నమ్మకంతో అంత బడ్జెట్‌ పెట్టారో అర్ధం చేసుకోవచ్చు.

కానీ చాలామంది సినీ పెద్దలు సినిమా పై నెగెటివ్ కామెంట్స్‌ చేశారని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసిందన్నాడు శిరీష్‌.

Who Gave Negative Publicity To Game Changer, Negative Publicity, Game Changer, T
"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
ఆ ఫ్యామిలీ నట వారసులు ఎందుకు వెనకబడుతున్నారు..?

తాము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోష పడుతున్నా.సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బయటపడ్డామన్నాడు.అయితే శిరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

గేమ్‌ ఛేంజర్‌ మూవీపై కావాలని నెగెటీవ్‌ ప్రాపగండ చేసిందెవరు? బ్యాడ్‌ పబ్లిసిటీ వెనుక ఎవరున్నారు? నెగెటివ్‌ కామెంట్స్ చేసిన సినీ పెద్దలు ఎవరు? ఇప్పుడిదే టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ గా మారింది.ఇలా ప్రతి సినిమాకు బ్యాడ్‌ పబ్లిసిటీ, నెగెటివ్‌ టాక్ క్రియేట్‌ చేసుకుంటూ పోతే ఇక టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది.

తాజా వార్తలు