ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా.? దాని నుండి తప్పించుకోవాలంటే ఇలా చేయండి.!

ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది.ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు.

నాడు అంటే అర్ధ‌భాగం అని అర్థం.శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది.

What Is Elinati Shani Effects And Remedies , Elinati Shani, Horoscope, Vishnu S

ఈ మధ్యకాలంలో శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా కనబడుతున్నారు.ఎలా అయితే మనము మన కర్మ ఫలాన్ని తప్పించుకోలేమో అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోలేము.

కానీ కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.జాతకచక్రంలో 12 రాశులుంటాయి.గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది.12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది.ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు.

Advertisement

దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం.శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి.

ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికి వెళ్లిపోవడం.తదితరాలు జరుగుతాయి.

శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు.ఉదాహ‌ర‌ణ‌కు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి.

అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి.శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు.ప్రతిశనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి.

Advertisement

పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు.యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి.

తాజా వార్తలు