కేసీఆర్‎కు నల్లా వివాదం చిక్కు..?

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన మిష‌న్ భ‌గీర‌థ‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.ఈ ద‌ర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకాధికారిని నియ‌మించింది.

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్య‌యం చేసింది.అయితే జ‌ల జీవ‌న్ క‌మిష‌న్ ఇటీవ‌లే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌ర్వే నిర్వ‌హించింది.

ఈ క‌మిష‌న్ స‌ర్వే రిపోర్టు ఇటీవ‌లే కేంద్రానికి అంద‌గా.ఆ నివేదిక ఆధారంగా ప‌థ‌కంపై కేంద్ర జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు ఓ ఫిర్యాదు అందింది.

ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ప‌థ‌కంపై దర్యాప్తున‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.మిషన్ భగీరథపై తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

Advertisement

కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది.ఇదే విషయమై బీజేపీ సైతం విమర్శలు చేసింది.

కేసీఆర్ అవినీతినిబయటకు తీస్తామని బీజేపీ నేతలు గతంలో పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.అయితే మిషన్ భగీరథ పథకంలో అవినీతి చోటు చేసుకొందని అందిన ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం విచారణకు అధికారిని నియమించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 ఆగష్టు 7న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోమటిబండలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం.ప్రతి ఇంటికి మంచినీటిని అందించకుంటే 2018లో ఓట్లు అడగనని కేసీఆర్ ప్రకటించారు.

అయితే చాలా గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద నీళ్లు అందకున్నా కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని విపక్షాలు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.మరో వైపు మిషన్ భగీరథ పథకంపై కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని కూడా విపక్షాలు విమర్శలు చేశాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

మిషన్ కాకతీయపై కూడా ఆరోపణలు వచ్చాయి.మిషన్ భగీరథ పథకం మంచిదే అయినప్పటికీ అమల్లో మాత్రం అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు అధికారి ఈ విషయమై ఏం తేలుస్తారోననేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా మారింది.

తాజా వార్తలు