వివాహ వేడుకలో వెయిటర్ ను చితకబాది చంపేసిన అతిథులు..!

ఇటీవలే కాలంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది.ఏవైనా సమస్యలు ఉంటే సర్దుకు పోతేనే పరిష్కారం దొరుకుతుంది.

 Waiter Killed Over Dirty Plates Touching Guests At Up Wedding Details, Waiter ,-TeluguStop.com

లేదంటే చిన్న చిన్న కారణాలు కూడా చివరకు దారుణ హత్యలకు దారితీస్తాయి.మనిషి డబ్బుకు మాత్రమే విలువ ఇస్తూ సాటి మనిషి పట్ల విచక్షణారహితంగా, రాక్షసుడి లాగా ప్రవర్తిస్తున్నాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఒక వ్యక్తి వివాహ వేడుకలో వెయిటర్ గా( Waiter ) వెళ్లి, పాత్రలు తీసుకువెళ్తున్న ట్రే వివాహ వేడుకకు హాజరైన అతిథులకు( Guests ) పొరపాటున తగలడంతో.అతిథులంత వెయిటర్ ను దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో( Uttar Pradesh ) చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telugu Dirty Plates, Ghaziabad, Manoj, Pankaj, Uttar Pradesh, Waiter, Waiter Pan

గాజియాబాద్ లో మనోజ్( Manoj ) అనే వ్యక్తి వివాహ వేడుకల కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు.ఇటీవలే మనోజ్ కు ఓ గెస్ట్ హౌస్ లో జరిగిన వివాహ వేడుక( Wedding ) కాంట్రాక్ట్ వచ్చింది.వివాహ వేడుకలో పనిచేసేందుకు 26 ఏళ్ల పంకజ్( Pankaj ) అనే యువకుడు వెయిటర్ గా వెళ్ళాడు.

వివాహ వేడుకకు హాజరైన అతిథులు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రే వేసుకొని వెళ్తుండగా ఆ ట్రే పొరపాటుగా అతిథులకు తగిలింది.దీంతో వాగ్వాదం ముదిరి పెద్ద గొడవకు దారితీసింది.

కాంట్రాక్టర్ మనోజ్ తో సహా మరికొంతమంది పంకజ్ ను దారుణంగా చితకబాదారు.వారి దెబ్బలు భరించలేక అక్కడికక్కడే పంకజ్ ప్రాణాలు విడిచాడు.

Telugu Dirty Plates, Ghaziabad, Manoj, Pankaj, Uttar Pradesh, Waiter, Waiter Pan

అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఉండే అడవిలో పారేశారు.అయితే మరొకవైపు పంకజ్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అడవిలో ఒక మృతదేహం కనిపించింది.పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహం పంకజ్ దే అని తెలియడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube