Revanth Reddy : ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన..: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం నిప్పులు చెరిగారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఎజెండా లేకపోయినా స్పీకర్ నిర్ణయం మేరకు ఏదైనా చర్చించవచ్చని తెలిపారు.14 లక్షల ఎకరాల సాగు కోసం దివంగత నేత వైఎస్ఆర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు.తెలంగాణ వచ్చాక రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం( Kaleshwaram ) తీసుకొచ్చారన్నారు.

గత ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఏర్పాటు చేసిందన్న రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు( Medigadda project ) పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు.ఇసుక కదిలితే పిల్లర్లు కుంగాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు.బ్యారేజీని ఎవరూ చూడకుండా పోలీసులను కాపలాపెట్టారని మండిపడ్డారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన అని స్పష్టం చేశారు.హరీశ్ రావు, కడియం శ్రీహరి వంటి అనుభవం ఉన్నవారు వచ్చి చూడాలని కోరారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు