Das Ka Dhamki Review: దాస్ కా దమ్కీ రివ్యూ: విశ్వక్ సేన్ హిట్ తగిలేనా?

సొంత దర్శకత్వంలో విశ్వక్ సేన్( Vishwak sen ) హీరోగా నటించిన మూవీ దాస్ కా దమ్కీ.

( Das Ka Dhamki ) ఇందులో విశ్వక్ సేన్ సరసన నివేదా పెతురాజ్( Niveda Pethuraj ) హీరోయిన్ గా నటించింది.

అంతేకాకుండా రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షర గౌడ, హైపర్ ఆది, మహేష్, రోహిణి, పృధ్వీరాజ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించగా.

లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమాకు కరాటే రాజు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.మరి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.

Advertisement
Vishwak Sen Niveda Pethuraj Das Ka Dhamki Movie Review And Rating-Das Ka Dhamki

కథ:

ఇందులో విశ్వక్సేన్ కృష్ణ దాస్ అనే పాత్రలో కనిపిస్తాడు.అందులో ఆయనకు ఎవరూ ఉండరు.

ఇక ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా చేస్తాడు.అయితే ఓసారి ఆ హోటల్ కి వచ్చిన కీర్తి (నివేదా పేతురాజ్) చూసి మనసు పారేసుకుంటాడు.

ఇక ఆమె వెయిటర్ అనే విషయం దాపెట్టి ఒక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈఓ అని అబద్ధం చెబుతాడు.అయితే కొన్ని రోజుల తర్వాత కీర్తికి కృష్ణ దాస్ వెయిటర్ అని తెలుస్తుంది.

అయితే అప్పటివరకు ఆమె కోసం చేసిన పనుల వల్ల తన ఉద్యోగం కూడా పోతుంది.

Vishwak Sen Niveda Pethuraj Das Ka Dhamki Movie Review And Rating
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇంటి రెంట్ కట్టకపోవడంతో హౌస్ ఓనర్ గెంటేస్తాడు.ఇక రోడ్డు మీద పడ్డ సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) ఎదురవుతాడు.ఇక ఆయన తన అన్నయ్య కొడుకు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడు అని.అయితే రీసెర్చ్ మధ్యలో చనిపోయాడు అని చెబుతాడు.ఆయన స్థానంలోకృష్ణ దాస్ ని నటించమని అంటాడు.

Advertisement

ఇక సంజయ్ ఇంటికి వెళ్లిన కృష్ణ దాస్ అక్కడ చూసి షాక్ అవుతాడు.కారణమేంటంటే సంజయ్ రుద్ర ఫార్మా కంపెనీ సీఈవో.

ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

ఇక విశ్వక్ సేన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు పాత్రలలో అద్భుతంగా నటించాడు.

నివేదా కూడా తన పాత్రతో ఆకట్టుకుంది.రావు రమేష్ తన పాత్రను భుజాలపై మోసాడు.

హైపర్ ఆది, మహేష్ కామెడీ తో బాగా సక్సెస్ అయ్యారు.నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

ఇక టెక్నికల్ పరంగా చూసినట్లయితే కథను బాగా తీసి ప్రయత్నం చేశాడు విశ్వక్సేన్.లియోన్ అందించిన సంగీతం పర్వాలేదు.దినేష్ కే బాబు సినిమాటోగ్రఫీ బాగుంది.

మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

కొన్ని కొన్ని సన్నివేశాలు, సైట్ లో రొటీన్ గా అనిపించాయి.కొత్త సినిమా చూసినట్లు ఎటువంటి ఫీల్ ఉండదు.

కథ కూడా చాలా రొటీన్ గా అనిపించింది.కామెడీ పరంగా మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

సినిమా స్టోరీ, ట్విస్ట్, నటీనటుల నటన, సంగీతం.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త సాగినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే కథలో, లాజిక్ లో ఏ మాత్రం సంబంధం లేకున్నా కూడా కాస్త పరవాలేదు అన్నట్లుగా అనిపించింది.ముఖ్యంగా కామెడీ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది అని చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/5

తాజా వార్తలు