పెళ్లి పిలుపులో న్యూ ట్రెండ్.. తెలంగాణ యాసలో వెడ్డింగ్ కార్డ్.. భలేగా ఉంది కదా..

ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లోని పెళ్లిలను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.జీవితంలో ఒకేసారి జరిగే సంఘటన కావడంతో ఖర్చుకు వెనకాడకుండా చాలామంది వివాహాలను( Wedding ) పెద్దపెద్ద సెట్టింగులు వేసి బంధు మిత్రులందరి సమక్షంలో జరుపుకుంటున్నారు.

 Viral Wedding Card In Pure Telangana Slang Details, Social Media, Viral News, We-TeluguStop.com

అయితే పెళ్లి కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అన్ని వెరైటీగా ఉండాలని కొత్త పోవడలకు వెళ్తున్నారు చాలామంది.ఇందులో భాగంగానే తాజాగా ఓ పెళ్లి పిలుపుకు సంబంధించిన విషయం కాస్త వైరల్ గా మారింది.

ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

తాజాగా తెలంగాణలోని ఓ వివాహం సంబంధించిన పెళ్లి కార్డు( Wedding Card ) వైరల్ గా మారింది.

ఈ పెళ్లి కార్డులో పూర్తిగా తెలంగాణ యాసను( Telangana Slang ) ఉపయోగించి వెళ్లివారు వారి బంధుమిత్రులను వివాహానికి ఆహ్వానిస్తున్నారు.ఈ పెళ్లి కార్డులో ‘ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.

యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది” అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రికను కొట్టించి.దానిని వారి బంధుమితురులకి పంచడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Jagityala, Puretelangana, Sathish Reddy, Suguna, Telangana Slang, Velmala

ఇక వీటితోపాటు ‘లగ్గం యాడనో ఎర్కన అంటూ. ప్రదేశం పేరు, తలువాలు ఏసినంక బువ్వ తినాలంటూ’ అందులో పూర్తిగా తెలంగాణ యాసలో పేర్కొన్నారు.అంతేకాకుండా పెళ్లి సందర్భంగా ‘అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల’ పేర్లను తెలిపారు.ఇక ఈ ముచ్చటంత జగిత్యాల జిల్లా( Jagityala District ) భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్​ రెడ్డి, సుగుణ దంపతులు తమ చిన్న కొడుకు సతీశ్​రెడ్డి పెళ్లి కార్డు పంచాయితీ అనమాట.పెళ్ళికార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించారు కుటుంబసభ్యులు.

Telugu Jagityala, Puretelangana, Sathish Reddy, Suguna, Telangana Slang, Velmala

లగ్గం యాడనో ఎర్కన అంటూ ప్రదేశం పేరు, తలువాలు ఏసినంక బువ్వ తినాలంటూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల పేర్లను తెలిపారు.జగిత్యాల జిల్లా భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్​ రెడ్డి, సుగుణ దంపతులు తమ చిన్న కొడుకు సతీశ్​రెడ్డి పెళ్లి కార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించారు.

పూర్తిగా తెలంగాణ యాస ఉట్టిపడేలా ” వెల్మలోళ్ల లగ్గం పిలుపు ” అంటూ పూర్తిగా తెలంగాణ యాస ఉట్టిపడేలా కార్డ్ ప్రింట్ చేయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube