Dion Kelbrick Lion : వైరల్: కొదమ సింహంపై దర్జాగా దాడి చేసిన దున్నపోతులు చూడండి!

కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు.బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి.

అడవిలో మకుటంలేని మహారాజుగా వెలిగే సింహం ఒకానొక దశకు చేరుకున్నాక చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.సింహం వేట మొదలుపెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

చిన్న జంతువులనుండి పెద్ద పెద్ద జంతువుల వరకు వాటికి భయపడతాయి.అయితే అదే సింహం ముసలిది అయితే మాత్రం దానికి చుక్కలు కనబడతాయి.

తోటి సింహాల గుంపు కూడా వాటిని వదిలేస్తాయి.ఇక్కడ వీడియోలో కనబడుతున్న సంహానికి కూడా సరిగ్గా అదే గతి పట్టింది.

Advertisement

ఇక్కడ మనకు వీడియోలో కనబడుతున్న సింహాన్ని గమనిస్తే దానిపై దున్నపోతులు మూకుమ్మడిగా దాడి చేయడం చూడవచ్చు.ఇక ఆ సింహం వృద్ధాప్య భారంతో బాధపడుతోంది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోని డియోన్ కెల్‌బ్రిక్ అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సఫారీలో పర్యాటకుల బృందంతో పంచుకోగా అది కాస్త వెలుగు చూసింది.

ఆ వీడియోకి "మగ సింహం గేదెల మంద మధ్య చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతుంది" అని క్యాప్షన్ పెట్టారు.ములుగుతూ వున్న సింహం పై దున్నపోతుల మంద వెళ్లి కొమ్ములతో పొడుస్తూ.

దానిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.పాపం వాటి నుంచి తప్పించుకునేందుకు దాదాపు ఓ పావుగంట పాటు సింహం ప్రతిఘటించడం చూడవచ్చు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

అయితే దాడి జరిగిన 3 రోజుల తర్వాత సింహం చనిపోయిందని ఫోటోగ్రాఫర్ నెటిజన్లకు కామెంట్ ద్వారా తెలియజేశారు.ఈ వీడియో కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు