Video Editing : వైరల్ వీడియో: వావ్, ఈ ఎడిటింగ్ లెవెల్ చూస్తే నవ్వాగదు..

సాధారణంగా ప్రజలు తమ ఫొటోలు, వీడియోలలో తాము గొప్పగా కనిపించేటట్లు వాటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతుంటారు.

అయితే ఒక్కోసారి వీరు ఎడిట్ చేసే మీడియా కంటెంట్ చూస్తే నవ్వక తప్పదు.

కొందరు హీరోయిన్లపై చేయి వేసి దిగినట్లు, మరికొందరు డైరెక్ట్‌గా హీరోహీరోయిన్లతో మాట్లాడినట్లు కూడా ఎడిట్ చేస్తుంటారు.ఇంకొందరు ప్రకృతి అందాలలో తాము లేకపోయినా ఉన్నట్లు సృష్టిస్తారు.

Viral Video Wow, This Level Of Editing Is Not Funny , Video Editing, Funny Edit

ఈఫిల్ టవర్‌పై ఎక్కినట్లు, లగ్జరీ కార్లపై కూర్చున్నట్లు, బైక్స్ రైడ్‌ చేస్తున్నట్లు ఎడిట్లు చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తుంటారు.కాగా తాజాగా ఇద్దరు దంపతులు తాము ఓ పెద్ద రాతి కొండపై నిలుచున్నట్లు ఎడిట్ చేసుకున్నారు.

ఇది చూసేందుకు నమ్మేటట్లు లేదు.పైగా వారు పెద్ద రాతి కొండ కంటే ఇంకా పెద్దగా కనిపించారు.

Advertisement

దీంతో ఇదేం ఎడిట్, రా నాయనో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అయిన వీడియోలో.ఓ రాతి కొండపై ఒక మహిళ, పురుషుడు నిల్చొని ఉండటం మీరు వీక్షించవచ్చు.

వీరిద్దరూ భార్యాభర్తలు అని తెలుస్తోంది.కాగా వీరు చాలా క్రియేటివ్ గా ఆలోచించి తమ ఫొటోను ఒక రాతి కొండపై ఎడిట్ చేశారు.

రాతి కొండ కింద పెద్ద లోయ ఉంది.ఆ లోయలో పెద్దగా చెట్లు పెరిగి ఉన్నాయి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

ఇంకోవైపు చూస్తే అలాంటి రాతి కొండలు మరికొన్ని ఉన్నాయి.ఇవి నిటార్‌గా చాలా ఎత్తులో ఆకాశాన్ని తాగేటట్టు ఉన్నాయి.

Advertisement

అలాంటి దానిపై వీరు ఇద్దరే పట్టారు.అంతేకాదు కాస్త అటు, ఇటు జరిగిన కిందపడిపోయేటట్లు ఉన్నారు.

ఇలా చాలా ఆర్టిఫిషియల్ ఎడిటింగ్ తో ఈ జంట తమ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఎడిటింగ్ గొప్పగా లేదు కాదు కానీ ఫన్నీగా ఉండటంతో ఇది బాగా వైరల్ అయింది.

ఇప్పటి వరకు ఈ వీడియోకు 90 లక్షల వరకు వ్యూస్, 3 లక్షల వరకు లైక్స్ వచ్చాయి.ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా వీక్షించండి.

తాజా వార్తలు