వైరల్ వీడియో: ఈ డాగ్ స్కిల్స్ చూస్తే మతిపోవడం ఖాయం..

ట్రైనింగ్ ఇస్తే కుక్కలు అద్భుతమైన పనులు చేయగలవు.ముఖ్యంగా కొన్ని జాతుల కుక్కలు మనుషుల కంటే ఎక్కువ పర్ఫెక్షన్‌తో టాస్కులు పూర్తి చేస్తాయి.

 Viral Video This Dog's Skills Are Sure To Make You Swoonpink , Border Collie, Ob-TeluguStop.com

వాటిలో బోర్డర్ కోలీ జాతి ఒకటి.వీటికి తెలివితేటలు, శక్తి, చురుకుదనం ఎక్కువ.

తాజాగా ఈ బ్రీడ్‌కి చెందిన ఒక కుక్క తన అద్భుతమైన స్కిల్స్‌తో ఒక హర్డిల్స్ గేమ్ అద్భుతంగా పూర్తిచేసి వావ్ అనిపించింది.

పింక్( Pink ) అనే ఈ టాలెంటెడ్ డాగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో పింక్ తన యజమాని, ట్రైనర్ చెప్పినట్లు హర్డిల్స్ కోర్సులో పోటీపడుతుంది.ఇది హర్డిల్స్ మీదుగా దూకుతుంది, సొరంగాల గుండా నడుస్తుంది.

అద్భుతమైన వేగం, కచ్చితత్వంతో బీమ్స్‌పై బ్యాలెన్స్ చేస్తుంది.ఆమె తన యజమాని చేతుల్లోకి దూసుకెళ్లి, తన ఆనందం, ఆప్యాయతను చూపుతూ కోర్సును పూర్తి చేస్తుంది.

“డోంట్ బ్లింక్ ఆర్ యూ విల్ మిస్ ఇట్” ( Don’t Blink or You’ll Miss It )అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో, 70 లక్షలకు పైగా వ్యూస్, వేలాది వ్యాఖ్యలను పొందింది.“చివరికి కుక్క ట్రైనర్ చేతుల్లోకి దూకడం ఒక బెస్ట్ మూవ్!” అని ఒక నెటిజెన్ అనగా.“వావ్! ఈ కుక్క ఇన్‌క్రెడిబుల్.చాలా వేగంగా, కచ్చితమైనదిగా ఉంది.” అని అన్నారు.“బెస్ట్ వర్కింగ్ డాగ్, ట్రైనర్” అని కొందరు వ్యాఖ్యానించారు.ఈ కుక్క వీడియోను B&S అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనిని మీరు కూడా చూసేయండి.https://twitter.com/_B___S/status/1729309228387504144?t=64mEU7Joy2NDddK7fHxrKw&s=19 లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోను చూడవచ్చు.

https://twitter.com/i/status/1729309228387504144
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube