అర్హులకు సంతృప్త స్థాయిలో కేంద్ర పథకాల చేరవేయాలన్నదే వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులకు సంతృప్త స్థాయిలో కేంద్ర పథకాల చేరవేతకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా అన్నారు.

ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోందనీ జిల్లాలోని అర్హులందరూ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందాలన్నారు.

శుక్రవారం కోనారావు పేట మండలం మల్కపేట గ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా మాట్లాడుతూ.

యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా ఎంతమందికి ప్రయోజనం కలిగింది.ఇంకా ఎంత మంది అర్హులు ఉన్నారో తెలుసుకోవడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమన్నారు.

జిల్లాలోని మారుమూల ప్రాంతాల చిట్ట చివరి లబ్ధిదారుడికి కేంద్రం అమలు చేస్తున్న పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు.వ్యవసాయంలో నానో టెక్నాలజీ కి పెద్ద పీట వేయలన్నారు.

Advertisement

నానో యూరియా తో పంట దిగుబడి తగ్గడమే కాకుండా , భూమి, వాతావరణం కాలుష్యం కాకుండా చూడవచ్చున్నారు.డ్రోన్ ఆధారిత పిచికారీ తో తక్కువ సమయంలో వేగంగా పంట చీడ లను అరికట్టవచ్చునని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సమర్థ్ కార్యక్రమం ద్వారా టైలరింగ్, జుకి, ఎంబ్రాయిడరీ, స్టిచింగ్ లో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందన్నారు.ఉపాధి మార్గాలను చూపుతుందని అన్నారు.

వీనిని ఆసక్తి గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దేశంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి చెందుతుందన్నారు.

జిల్లాలో వికసిత్ సంకల్ప భారత యాత్రలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద కొత్తగా రిజిస్టర్ చేసుకున్న 700 మంది లబ్ధిదారులకు వచ్చే రెండు రోజుల్లో సిలిండర్లు ,రెగ్యులేటర్లు అందించాలని ఆయన పౌర సరఫరాల అధికారులకు సూచించారు.అనంతరం పథకాలను మరింత ప్రభావంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోన్నారు.లబ్దిదారుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలు స్వీకరించారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ పథకాల ను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందిన లబ్ధిదారులను కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా శాలువా తో సన్మానించారు.

డ్రోన్ తో పిచికారి కార్యక్రమం తిలకింత

ఆ వెంటనే రైతులకు డ్రోన్ సాయంతో వ్యవసాయం ఎలా చేయొచ్చునో తెలిపే ప్రదర్శన ను ఆయన తిలకించారు.

డ్రోన్ టెక్నాలజీ లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే కాకుండా.దగ్గర నుంచి డ్రోన్‌తో ఎరువులు చల్లి నిర్వాహకులు చూపించారు.

  ప్రదర్శనను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.రైతులకు డ్రోన్ ఆధారిత పిచికారి తో అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు.

ప్రదర్శనలో ఉంచిన డ్రోన్ 10 లీటర్ల ద్రావణం ను మోసుకెల్లి 5 నిమిషాలలో ఒక ఎకరం పిచికారి చేయగలదు.వరి, మిర్చి, పత్తి తదితర పంటలే కాకుండా ఎత్తుగా పెరిగే నిమ్మ, మామిడి తోటల లో పిచికారీ చేయవచ్చు.ఈ డ్రోన్ వ్యయం రూ.6 లక్షలు కాగా సింహ భాగం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా బ్యాంకులు అందిస్తాయి.అద్దె కు తీసుకుంటే.

ఒక్కో ఎకరాకు 500 వందల వరకూ చార్జీ చేస్తారు.అంతకుముందు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా ప్రభుత్వ పాఠశాలలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రకృతి వ్యవసాయ సాగులో పండించిన పంటల ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను, కూరగాయలతో వేసిన ముగ్గులు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార స్టాల్స్‌ను, వంట గ్యాస్, టెక్స్టైల్, మత్య అభివృద్ధి నీ తెలిపే స్టాల్స్‌ను సందర్శించారు.

ఆయిల్ ఫామ్ , నానో యూరియా స్ప్రే, ప్రధానమంత్రి ఉజ్వల పథకం, అయుష్మాన్ , ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్, ఆర్గానిక్ ఫామ్, సమర్థ శిక్షణ, ఐసీడీఎస్ పోషణ పథకాల లబ్దిదారులు తమ అనుభవాలను కార్యక్రమంలో ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, డి ఆర్ డి ఓ నక్క శ్రీనివాస్, టెక్స్టైల్ ఎడి సాగర్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ ఈ జానకి, డి డబ్ల్యూ ఓ లక్ష్మి రాజం , డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లి ఖార్జున్, జిల్లా క్రీడల యువజన అధికారి అజ్మీరా రామ్ దాస్ , స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం బోయినపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామములో వికసిత్ భారత సంకల్ప యాత్ర లో కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా పాల్గొన్నారు.శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా దంపతులు శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారినీ దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest Rajanna Sircilla News