కత్రినా, విక్కీ హనీమూన్ ప్లాన్ లీక్.. లాంగ్ ట్రిప్ వేయనున్న కొత్తజంట!

గత రెండు నెలలుగా బాలీవుడ్ మీడియాలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది ఖచ్చితంగా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి గురించే అని చెప్పాలి.

వీరి పెళ్లి గురించి బాలీవుడ్ మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఎన్నో రోజులుగా మాట్లాడు కుంటున్నారు.

పెళ్లి డేట్ ఫిక్స్ అయినా, అందరికి ఆహ్వానాలు అందిన కూడా వీరిద్దరూ పెళ్లి గురించి అఫిషియల్ గా ప్రకటించక పోవడంతో వీరి పెళ్లిపై మరిన్ని గాసిప్స్ పెరిగాయి.అయితే మూడు ముళ్లు పడ్డాక గానీ వీరిద్దరిపై వచ్చిన రూమర్స్ గురించి కానీ, లవ్ గురించి కానీ, వీరిద్దరి పెళ్లి గురించి కానీ స్పందించలేదు.

పెళ్లి జరిగే వరుకు ఎన్ని రూమర్స్ వచ్చిన మౌనమే వీరి సమాధానం అయ్యింది.అయితే అలా పెళ్లి జరగగానే అప్పటి వరకు మాట్లాడకుండా ఉన్న ఈ స్టార్ కపుల్ పెళ్లి అయిన వెంటనే ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా అందరికి తెలిసేలా చేసారు.

సినిమా ఇండస్ట్రీ వారు వీరిద్దరి పెళ్ళికి హాజరవ్వగా అంగరంగ వైభవంగా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి డిసెంబర్ 9న జరిగింది.

Advertisement

పెళ్లి వేడుక ఘనంగా ముగిసిన తర్వాత ఇప్పుడు వారి తర్వాత ప్రణాళికల గురించిన గాసిప్స్ జోరందు కుంటున్నాయి.తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వార్త ఏమిటంటే.

ఈ జంట తమ హనీమూన్ కోసం యూరప్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.అయితే కేవలం ఈ ట్రిప్ యూరప్ లోని రెండు లేదా మూడు ప్రాంతాలకే కాకుండా యూరప్ మొత్తం చుట్టి రాబోతున్నట్టు సమాచారం.అందుకే వీరిద్దరూ హనీమూన్ కోసం దాదాపు 2 నెలల సమయాన్ని కేటాయించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

ఈ హనీమూన్ విక్కీ ఆలోచన అట.ఎందుకంటే పెళ్లి వేడుక మొత్తం కత్రినా ఇష్టప్రకారంగా జరిగినట్టు తెలుస్తుంది.అందుకే విక్కీ హనీమూన్ ప్లాన్ చేసాడట.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు