వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది ప్రచార రథం పై దాడి

కారులో వచ్చిన 4 గురు.

గుర్తు తెలియని దుండగులు ప్రచార రథాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం! వేములవాడ అర్బన్ మండలంలోని నంది కమాన్ శివారు ప్రాంతంలోని ప్రధాన రహదారి వద్ద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్(Aadi Srinivas ) ప్రచార రథం పై బుధవారం సాయంత్రం నలుగురు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి దాడికి యత్నించిన ఘటన వేములవాడ అర్బన్ మండలంలోని నంది కమాన్ శివారు ప్రాంతంలోని ప్రధాన రహదారి వద్ద చోటు చేసుకుంది.

వెంటనే సంఘటన స్థలానికి వేములవాడ( Vemulawada ) డి.ఎస్.పి నాగేంద్ర చారి, ఎస్సై ప్రశాంత్, పోలీస్ సిబ్బంది చేరుకొని ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు.ఘటన విషయం తెలుసుకున్న వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకొని పరిశీలించారు.

ఆది శ్రీనివాస్ ప్రచారాన్ని, ఆయన గెలుపును ఓర్వలేకే ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వినతి పత్రం అందించేందుకు పట్టణ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు
Advertisement

Latest Rajanna Sircilla News