తరచు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలు సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లో తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 10 ఇసుక వాహనాలను గుర్తించి జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ సిరిసిల్లకి అప్పజెప్పగా అట్టి వాహనాలను కోర్ట్ లో హాజరు పర్చగా కోర్ట్ 06 వాహనాలు జప్తు చేయడం జరిగిందని, మిగితా 04 వాహనాలను కూడా కోర్ట్ త్వరలో జప్తు చేయడం జరుగుతుంది అని డిఎస్పీ శుక్రవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూజిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలను గుర్తించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

అక్రమ ఇసుక రవాణాలో రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు వాహనాలు పట్టుపడితే అట్టి వాహనాల జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ సిరిసిల్ల కి అప్పజెప్పడం జరిగుతుందన్నారు.అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ వారు అట్టి వాహనాలను కోర్టులో హాజరు పర్చగా అట్టి వాహనాలను కోర్ట్ జప్తు చేసి అట్టి వాహనాల మీద కోర్ట్ కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నారు.

ఇప్పటి వరకు తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 06 ఇసుక వాహనాలను ( Sand vehicles )కోర్ట్ జప్తు చేవడం జరిగిందన్నారు.ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఇసుక రవాణానాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తుల పై చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.

ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వారి పై కేసులు నమోదు చేయడం తో పాటుగా వాహనాల ను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News