సిరిసిల్ల ఫ్యాక్స్ ద్వారా వాహనాల కొనుగోలుకు ఋణ మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం సిరిసిల్ల పాక్స్ ద్వారా వాహన కొనుగోలుకు 13,00000 రూ:లు ఋణ మంజూరు చేసి లబ్ధిదారు గడ్డం భవాని కి ఈ రోజు వాహనాన్ని అందించడం జరిగింది.

ఈ సందర్భంగా చేర్మెన్ బండి దేవదాస్( Bandi Devadas ) మాట్లాడుతూ పాక్స్ ద్వారా రైతులకు కారు,ద్విచక్రవాహనం కొనుగోలు పై ఋణ మంజూరు చేసి లబ్ధిదారులకు వాహనాన్ని అందించడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని రైతులు( Farmers ) సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి,డైరెక్టర్స్ గడిల సురేష్, వెన్నమనేని శ్రీధర్ రావు, బండి దేవేందర్ యాదవ్ బనావత్ గన్యా నాయక్,కొమ్మేట పర్షయ్, పన్యాల ప్రమిలమ్మ, కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఆర్ దామోదర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.బాలయ్య,సీఈఓ బుర్ర నరేష్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

Latest Rajanna Sircilla News