ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ దూరం అవ్వడం గ్యారెంటీ!

జుట్టు రాలడం( hair loss ) అనేది దాదాపు అందర్నీ అత్యంత కామన్ గా వేధించే సమస్య.

అయితే అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే రకమైన కారణాలు ఉండకపోవచ్చు.

ఏదేమైనా రోజు ఊడిపోతున్న జుట్టును చూస్తే చాలా బాధ కలుగుతుంది.కొందరు తీవ్ర ఒత్తిడికి కూడా లోనవుతుంటారు.

కానీ ఇకపై నో టెన్షన్.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ను కనుక వాడితే హెయిర్ ఫాల్ దూరం అవ్వడం గ్యారెంటీ.

సీరం తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కరివేపాకు( Curry leaves ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్మేరీ ఆకులు( Rosemary leaves ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement
Use This Homemade Serum To Prevent Hair Fall! Hair Fall, Hair Serum, Homemade Se

వాటర్ బాగా బాయిల్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Use This Homemade Serum To Prevent Hair Fall Hair Fall, Hair Serum, Homemade Se

కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ సీరం అనేది రెడీ అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు సీరంను అప్లై చేసుకుని ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకోవచ్చు.

లేదా సీరం అప్లై చేసుకున్న గంట అనంతరం తలస్నానం చేయవచ్చు.

Use This Homemade Serum To Prevent Hair Fall Hair Fall, Hair Serum, Homemade Se

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ న్యాచురల్ సీరంను కనుక వాడడం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.ఈ సీరం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే మీరీ ఫేస్ ప్యాక్స్ వాడాల్సిందే!

జుట్టు రాలే సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.అలాగే ఈ సీరంను ఉప‌యోగించ‌డం వల్ల ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.

Advertisement

కురులు దట్టంగా మారతాయి.

తాజా వార్తలు