ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా యొక్క ‘ఫ్యామిలీ లైక్ కేర్’ ప్రమాణాల ఉత్తమ మోడలుకు యునైటెడ్ వే సోషల్ ఇన్నొవేషన్ అవార్డ్ 2020-21 లభించింది

హైదరాబాద్, ఫిబ్రవరి 9, 2021: తల్లిదండ్రల ప్రేమకు దూరమైన పిల్లలకు కుటుంబం వంటి సంరక్షణ అందించుటకు అంకితమైన అతిపెద్ద ఎన్.జి.

ఓ సంస్థ ‘ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా’కు, గేమ్ ఛేంజర్ కేటగిరీలో, దీని ఫ్లాగ్ షిప్ చిల్డ్రన్స్ విలేజెస్ ప్రాజెక్టులో, తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన పిల్లల జీవితాలపై దీర్ఘకాల ప్రభావం చూపేవిధంగా ‘ఫ్యామిలీ లైక్ కేర్’ సంరక్షణ ప్రమాణాలు కలిగిన సేవలు మోడలుకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (UWH) అనే నాన్-ప్రాఫిట్ వాలంటీర్ నిర్వహణ సంస్థ నుండి ‘సోషల్ ఇన్నొవేషన్ అవార్డ్ 2021’ లభించింది.1964లో స్థాపించబడిన ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం తల్లిదండ్రులు, సోదరులు.మరియు సోదరిలతో లభించే ఇంటి ప్రేమకు దూరమైన సుమారుగా 7,000 మంది పిల్లలకు (0-25 సంవత్సరాలు) సంరక్షణ అందిస్తున్న సంస్థ – ఇలాంటి 12-15 కుటుంబాలు చిల్డ్రన్స్ విలేజెస్ అనే సురక్షిత స్థానాలలో నిర్వహించబడుతున్నవి.

ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 22 రాష్ట్రాలు మరియు యూనియన్ టెర్రిటరీలలో 32 స్థానాలలో పనిచేస్తూ ఉన్నది.విద్య, ఆరోగ్యం మరియు సంక్షేమం, ఆర్థిక సుస్థిరత మరియు ఇండియాలోని పర్యావరణ వంటి విషయాలలో కార్పొరేట్లు మరియు ఎన్.జి.ఓలు నిర్వహించే అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించుటకు UWH ద్వారా సోషల్ ఇన్నొవేషన్ అవార్డ్ స్థాపించబడింది.2021 కొరకు అవార్డు అందించే జ్యూరీ సభ్యులలో UWH బోర్డు మెంబర్లు, విద్యాసంస్థల మెంబర్లు, ఎర్నస్ట్ అండ్ యంగ్, ఆడిటింగ్ అండ్ కన్సల్టింగ్ రంగాలలోని వృత్తి నిపుణులు ఉన్నారు.ఈ సైటేషన్ వివరణ ప్రకారం: ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా “సంరక్షణ మరియు సంక్షేమం విభాగంలో దీర్ఘకాలం నిలిచే ప్రమాణాల ద్వారా మార్పు తీసుకురావటానికి నిబద్ధత చూపించింది”.ఎన్.జి.ఓ “అత్యంత దుర్భర స్థితిలో ఉన్న ప్రజల అవసరాలను గుర్తించి, దీర్ఘకాల మరియు తక్షణ అవసరాలను తీర్చుతూ ఆదుకొనుట ద్వారా ఆరోగ్యకరమైన మరియు తమ కాళ్లపై నిలబడగలిగే ఒక తరాన్ని నిర్మించుట కొరకు మార్పుకొరకు మోడల్ తయారు చేసింది” అని కూడా గుర్తించింది.

United Way Social Innovation Award 2020-21 For Best Model Of ‘family Like Care

ఈ అవార్డు గెలుచుకున్న సందర్భంగా శ్రీ సుమంత్ కర్, సీనియర్ నేషనల్ డెప్యూటీ డైరెక్టర్, ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా ఇలాఅన్నారు, “ఈ అవార్డు ద్వారా మా సంస్థ యొక్క మొత్తం టీముకు ఒక అద్భుతమైన ప్రేరణ మరియు మోటివేషన్ కొరకు ఒక ఆధారంగా నిలుస్తుంది.కుటుంబం వంటి సంరక్షణ మోడలు యొక్క ముఖ్య ఉద్దేశం, తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించే సంరక్షణ సంస్థాగత చర్యగా ఉండకూడదు.ఇది ప్రేమ, గౌరవం మరియు భద్రతతో ఇంటిలో పెరిగే పిల్లలకు లభించే తల్లి సంరక్షణ వలె ఆదర్శంగా ఉండాలి.

ప్రతి ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ లో కనీసం 12-15 కుటుంబాలు ఉంటాయి – మరియు ప్రతి కుటుంబంలో 8-10 మంది పిల్లలను పెంచుట జరుగుతుంది.ప్రతి పిల్లవాడి సంరక్షణ ఎస్ఓఎస్ తల్లి అనే సుశిక్షిత చైల్డ్ కేర్ వృత్తినిపుణురాలి ఆదరణలో ఉంటుంది.

Advertisement
United Way Social Innovation Award 2020-21 For Best Model Of ‘Family Like Care

ఈమె పిల్లలతో కలిసి నివసిస్తుంది, సుదీర్ఘకాలం ఎమోషనల్ రిలేషన్షిప్ నిర్మాణంలో పాలు పంచుకుంటుంది.ఇలా ఆమె పిల్లలు పూర్తి శక్తిమంతులుగా మారి, తమ కాళ్లపై నిలబడేవరకు వారి జీవితాలను మార్చుతుంది, వారు స్వయంగా శక్తిమంతులుగా మారి.

సమాజానికి తమ వంతు సేవలు అందించేవారిగా మారే వరకు వారికి సహకారం అందిస్తుంది.ఇక్కడ ఈ పిల్లలు మరికొందరు పిల్లలతో కలిసి, ఒక రకం కుటుంబ వాతావరణం మధ్య పెరుగుతూ, పరస్పర సహకారం మరియు పంచుకునే గుణం నేర్చుకుంటూ, తమ సముదాయం అని చెప్పుకునే తమ సొంత సముదాయం మధ్య పెరుగుతారు.

” .

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు