మ‌ధుమేహం ఉన్న వారు బొబ్బ‌ర్లు తింటే ఏం అవుతుందో తెలుసా?

నేటి కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మందిని మ‌ధుమేహం వ్యాధి వేధిస్తున్న సంగ‌తి తెలిసిందే.ర‌క్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుత‌గ్గుల వ‌ల్ల మధుమేహం ఏర్ప‌డుతుంది.

ఒక్క‌సారి ఈ మ‌ధుమేహం వ‌చ్చిందంటే.జీవిత‌కాలం వేధిస్తూనే ఉంటుంది.

అందుకే మ‌ధుమేహం అంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.అయితే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.

అలాంటి వాటిలో బొబ్బ‌ర్లు కూడా ఒక‌టి.బొబ్బర్ల‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా.

Advertisement

కొవ్వు, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అలాగే బొబ్బర్ల‌లో బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు కూడా నిండి ఉంటాయి.

అటువంటి బొబ్బ‌ర్లు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.ముఖ్యంగా మ‌ధుమేహం ఉన్న వారు బొబ్బ‌ర్ల‌ను డైలీ డైట్‌లో చేర్చుకుంటే.

అందులో ఉండే లో-గ్లిజమిక్ ఇండెక్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను ఎప్పుడూ అదుపులో ఉండేలా చేస్తాయి.కాబ‌ట్టి, మ‌ధుమేహం ఉన్న వారు.

బొబ్బ‌ర్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం లేదా ఇత‌రిత‌ర విధాలుగా తీసుకోవ‌డం చేస్తే మంచిది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక బొబ్బ‌ర్ల‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.బొబ్బ‌ర్ల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.అలాగే అధిక బ‌రువు ఉన్న వారు.

Advertisement

ఉడికించిన బొబ్బ‌ర్లు తీసుకుంటే చాలా మందిచి.ఎందుకంటే, బొబ్బ‌ర్ల‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

ఫైబ‌ర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బ‌రువు త‌గ్గొచ్చు.బొబ్బ‌ర్ల‌లో యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ర‌క్షించ‌డంతో పాటు.హానికరమైన టాక్సిన్స్ ను నివారిస్తుంది.

ఇక క్యాల్షియం పుష్క‌లంగా ఉండే బొబ్బ‌ర్ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు మ‌రియు కండ‌రాలు దృఢంగా మార‌తాయి.బొబ్బ‌ర్లు త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది.

తాజా వార్తలు