బ్యాంక్‌ మోసగాడు నీరవ్ మోదీ ఆలోచనలకు చెక్ పెట్టిన లండన్ కోర్టు.. ఇక జైలే గతినా.. ?

పేరుకు పెద్ద కానీ చేసే పనుల్లో మాత్రం ఆ పెద్దరికం కనపడదు.

ఇలాగే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యిన వారిలో కొందరు మన దేశంలోని బ్యాంకులను ముంచి విదేశాల్లో కులుకుతున్నారు.

అలాంటి పెద్ద మనుషుల్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకరు.కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకే వెళ్లిపోయిన నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది.

చేసిన మోసం నుండి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్ళి, అక్కడే సెటిల్ అయ్యి, భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ మోదీ చేసిన ప్రయత్నాలన్నింటికీ కోర్టు చెక్ పెట్టింది.ఈ క్రమంలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సామ్యూల్ గూజీ ఈ తీర్పు చెప్పారు.ఇకపోతే పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టిన‌ కేసులో నీర‌వ్ మోదీపై లండ‌న్ కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది.అదీగాక మోసం, మ‌నీ లాండ‌రింగ్ వంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఇక ఇండియాకు వచ్చిన వెంటనే నీరవ్ ఊచలు లెక్కపెడుతాడో లేదో చూడాలి.

Advertisement
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తాజా వార్తలు