ఒక్కో కాలంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.ప్రస్తుతం సెల్ఫీ అనే ట్రెండ్ లో మునిగి తేలుతున్నారు యువత.
అయితే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనులు అప్పుడే మొదలైపోయాయి.విషయం ఏమిటంటే యూకేలోని సిటీ లిట్ కాలేజీ తమ విద్యార్థుల కోసం కొత్త కోర్స్‌ను ప్రవేశపెట్టనుంది.
ఆర్ట్ ఆఫ్ సెల్ఫీ పేరిట పూర్తిస్థాయి సెల్ఫీలు తీయడంలో నిష్ణాతులను చేయడం కోసం ఈ కోర్స్‌ను తీసుకు వస్తునట్లు సమాచారం.ప్రపంచంలోనే సెల్ఫీ కోర్స్‌ను ప్రవేశ పెడుతున్న మొట్టమొదటి కళాశాల ఇదే అని చెప్పవచ్చు.
సెల్ఫీ కోర్స్‌ను 132 యూరోలు లేదా 160 డాలర్లకు నేర్పించనున్నారు.ఈ కోర్స్ ఈ ఏడాది మార్చ్ నెలలో ప్రారంభం కానుంది.
ఈ కోర్స్ పేరు ది ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్‌రెచ్యూర్.అయితే ఈ కోర్స్ లో ఉన్న ప్రత్యేకమైన ప్రత్యేకత ఏమిటంటే .ముప్పై రోజుల వ్యవధిలో సెల్ఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలా తీయాలో నేర్పుతారట.ఇప్పటికే దాదాపుగా ప్రపంచం మొతం సెల్ఫీలతో ఉర్రూతలూగిపోతుంటే, ఈ నేపథ్యంలో సెల్ఫీలు తీయడంలో తమదైన శైలిని, తాము తీసే వాటిని ఓ మంచి జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ఇది ఉపకరిస్తుందనే విద్యార్థులు ఈ కోర్సు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy