ఉదయ సముద్రం ట్రయల్ రన్ సక్సెస్...!

నల్లగొండ జిల్లా:సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణవెళ్ళంల పానగల్ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.

బుధవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులు ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేయగా,రాత్రి 10 గంటలకు మోటార్లు రన్ చేసి విజయవంతంగా నీళ్లను ఎత్తి పోశారు.

చౌడంపల్లి శివారులోని పంపు హౌస్ వద్ద మోటార్లు ఆన్ చెసి పరీక్షించారు.పంపు హౌస్ నుంచి బ్రాహ్మణ వెళ్ళేంల శివారులోని రిజర్వాయర్ లోకి నీటిని పంపు చేయగలిగారు.

అధికారులతో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా అర్ధరాత్రి వరకు ప్రాజెక్ట్ వద్దనే ఉండి ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు.ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు పూర్తిలో అధికారుల కృషిని ఈ సందర్బంగా ఎమ్మెల్యే లింగయ్య అభినందించి,నకిరేకల్ నియోజక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

ప్రాజెక్ట్ పనుల విషయంలో యువ నేత కేటీఆర్,జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిలు సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేయాలి : కన్నెగంటి రవి
Advertisement

Latest Suryapet News