జుట్టు రోజురోజుకు బలహీనంగా మారుతుందా.. అయితే ఈ హెయిర్ మాస్క్ మీకోసమే!

సాధారణంగా ఒక్కోసారి జుట్టు అనేది చాలా బలహీనంగా మారిపోతుంటుంది.పట్టుకుంటే ఊడి చేతిలోకి వచ్చేస్తుంటుంది.

బలహీనమైన కురులను బలోపేతం చేసుకోవడానికి మొదట డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

అలాగే రెగ్యులర్ గా తల స్నానం చేసే అలవాటు ఉంటే వదులుకోవాలి.హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వాడటం మానుకోవాలి.

అలాగే అప్పుడప్పుడు కొన్ని హెయిర్ మాస్క్ లను ప్రయత్నిస్తూ ఉండాలి.ముఖ్యంగా జుట్టును( Hair ) స్ట్రాంగ్ గా మార్చడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.

Advertisement

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని ( Aloe vera plant )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటిపండును( Banana ) ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.

అలాగే అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( curd )మరియు రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Munagaku powder ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోండి.జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.అరటిపండు, కలబంద, పెరుగు మరియు మునగాకు లో ఉండే పోషకాలు బలహీనంగా ఉన్న కురులను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.

వీర్రాజు కు ఆ పదవి.. ? విష్ణుకూ ఛాన్స్ ? 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 6 శుక్రవారం, 2021

హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తాయి.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.ఆరోగ్యమైన దృఢమైన జుట్టును పొందాల‌ని కోరుకునే వారు తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు