తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన ట్రంప్

తోలి అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించడం ఏంటి అని అనుకుంటున్నారా.

ఏమిలేదండీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష దంపతులకు స్థానికులు ఘన స్వగతం పలికారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ దంపతులకు శాలువా కప్పి మరి ఆశ్రమ విశేషాలను వివరించారు.మరో విశేషం ఏమిటంటే ట్రంప్ ఆశ్రమం లోపలి వెళ్ళడానికి ముందు తన షూస్ విప్పి మరీ వెళ్లారు.

అంతేకాకుండా సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశాన్ని రాసి మరి సంతకం పెట్టడం విశేషం.అయితే ఇప్పటివరకు ఎందరో అమెరికా అధ్యక్షులు భారత్ లో పర్యటించినప్పటికీ ట్రంప్ మాత్రం ఒక ప్రత్యేక ఘనత సాధించారు.

Advertisement

అదేమిటంటే ఇలా సబర్మతి ఆశ్రమం సందర్శించిన తోలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.ఈ ఆశ్రమం లోపల ఉండే హృదయ్‌కుంజ్‌లో ఏర్పాటు చేసిన చరఖా ను కూడా తిప్పుతూ ట్రంప్ ఆశ్రమంలో సందడి చేశారు.

చరఖా తిప్పుతూ ట్రంప్ నూలు వడుకుతుండగా మెలానియా ట్రంప్ ఆసక్తిగా తిలకించారు.సుమారు 30 నిమిషాల పాటు ట్రంప్ ఆయన భార్య మెలానియా, అలానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆశ్రమంలో గడిపడం విశేషం.

Advertisement

తాజా వార్తలు