ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

గత ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని,ఐదు సంవత్సరాలుగా బదిలీలు లేవని,వెంటనే ప్రమోషన్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.

రాములు( Ch.

Ramulu ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రమోషన్లు చేపట్టాలని ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ టీచర్లను రెగ్యులర్ చేయాలని,మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రవచనాలు రాష్ట్ర కార్యదర్శి జి.

నాగమణి( G.Nagamani ), జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె.యాకయ్య,కోశాధికారి జి.వెంకటయ్య,జిల్లా కార్యదర్శులు ఎస్కె.సయ్యద్,సిహెచ్.

Advertisement

వీరారెడ్డి, బండి పాపిరెడ్డి,బి.ఆడమ్, మండల బాధ్యులు జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె అనిల్ కుమార్, ఆర్.శ్రీను,యరగాని.లింగయ్య,బండ్ల రమేష్, ఏలే సీనయ్య,ఎన్.

సైదా, ఎస్.అంజయ్య,ఎల్.ఆనంద్ కిషోర్, ఎం.చిత్తరంజన్,రాంజీ,బి.శ్రీనివాస్,ఎం.

యాదయ్య, చంద్రునాయక్, ఆంజనేయులు,డి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

Latest Rajanna Sircilla News