నిజామాబాద్ జిల్లా బోధన్ లో విషాదం.. ఆరేళ్ల బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ లో( Bodhan ) విషాదం నెలకొంది.కారు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక బాలుడు మృత్యువాత పడ్డాడు.

తల్లితో కలిసి పొలం వద్దకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు( Six Years Boy ) ఆడుకుంటూ అక్కడే ఉన్న కారులోకి( Car ) ఎక్కినట్లు తెలుస్తోంది.దీంతో బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలించారు.మరోవైపు రెండు రోజుల తరువాత కారు వద్దకు వెళ్లిన యజమాని వెనుక సీటులో ఉన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించాడు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో మిస్ అయిన ఆరేళ్ల బాలుడే కారులో డోర్ లాక్ అయి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు